కంకర రోడ్డైనా పచ్చగడ్డైనా బంతి మెలికలు తిరగాల్సిందే.. తన స్పిన్ తో సచిన్, బ్రెట్ లీ ని మెప్పించిన బుడ్డోడు..

By team teluguFirst Published Oct 15, 2021, 2:47 PM IST
Highlights

Sachin Tendulkar: భారత్ లో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. ఆరేండ్ల పిల్లాడి నుంచి అరవై ఏండ్ల ముసలిదాకా ఈ గేమ్ కు అభిమానులే. భారత్ లో క్రీడలెన్నో ఉన్నా క్రికెట్ కు ఉన్న ఆదరణ మరో స్థాయిలో ఉంటుంది.

నూట ముప్పై కోట్ల మందికి పైగా ఉన్న భారత్ వంటి దేశంలో జనం క్రికెట్ ను ఒక మతంగా చూస్తారు. ముఖ్యంగా 80వ దశకం తర్వాత భారత్ (India)లో క్రికెట్ ICricket)కు ఉండే క్రేజే మారిపోయింది. దిగ్గజ క్రికెటర్ కపిల్  దేవ్, సునీల్ గవాస్కర్ ఒక తరానికి ఆదర్శంగా నిలిస్తే తర్వాత వచ్చిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar).. క్రికెట్ దేవుడు అయిపోయాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ వంటి వారి ఆగమనం భారత క్రికెట్ (Indian Cricket) లో యువతలో ఎంతో స్ఫూర్తినింపింది. ఆరేండ్ల పసి పిల్లాడి నుంచి అరవై ఏండ్ల పండు ముసలిదాకా క్రికెట్ అంటే పడి చచ్చిపోయే వాళ్లు కోట్లాది మంది ఉన్నారు. నిండా నాలుగైదు ఏండ్లు లేని పిల్లలు కూడా క్రికెట్ ఆడటానికి కోచింగ్ సెంటర్ల వెంబడి పరుగులు తీస్తున్నారు. 

క్రికెట్ పట్ల అంత క్రేజ్ ఉన్న భారత్ లో చాలా మంది క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అందుకోసం చిన్నప్పటి నుంచే ఈ జెంటిల్మెన్ గేమ్ మీద ఆసక్తి పెంచుకుని రాటుదేలుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి విభాగాల్లో పంట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అబ్బయి కూడా తన స్పిన్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

 

స్పిన్ అంటే బంతిని గింగిరాలు తిప్పుతూ బ్యాట్స్మెన్ కండ్లు మూసి తెరిసేలోపు బాల్ వికెట్లను గిరాటేయాలి. ఈ వీడియో లో కనిపిస్తున్న అబ్బాయి కూడా అచ్చం అదే చేస్తున్నాడు. బౌలింగ్ వేయడానికి 22 యార్డ్స్ సర్కిల్ లేకున్నా.. అత్యాధునిక సదుపాయాలు లేకున్నా.. ఎటువంటి ప్రదేశంలోనైనా బంతిని స్పిన్ చేస్తున్నాడు. కంకర రోడ్డు మీద, పచ్చి గడ్డి మీద బాల్ ను స్పిన్ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. తన బౌలింగ్ తో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో పాటు ఆసీస్ స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ (bret lee) ని కూడా ఆకట్టుకుంటున్నాడు. 

ఇది కూడా చదవండి: IPL2021: 2008 నుంచి 2020 దాకా ఐపీఎల్ ఫైనల్లో ఇరగదీసిన మొనగాళ్లు వీళ్లే.. రేపటి వీరుడు ఎవరో మరి..?

ఇందుకు సంబంధించిన వీడియోను ఏకంగా సచిన్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడం గమనార్హం. ఈ వీడియోను సచిన్ షేర్ చేస్తూ.. ‘ఒక మిత్రుడి నుంచి ఈ వీడియోను పొందాను. ఈ చిన్నపిల్లోడికి క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి స్పష్టంగా తెలుస్తున్నాయి’ అని పేర్కొన్నాడు. 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ.. సచిన్ పోస్టుకు  స్పందించాడు. ‘ఆ అబ్బాయి ఆడగలడు’ అని కామెంట్ పెట్టాడు.  బ్రెట్ లీ తో పాటు ప్రముఖ బాలీవుడ్ (bollywood) నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కూడా  సచిన్ వీడియోకు కామెంట్ పెట్టాడు. ‘బాంబూజ్ల్డ్’ అని రణ్వీర్ రాసుకొచ్చాడు. రణ్వీర్ హీరోగా.. బాలీవుడ్ లో తెరకెక్కిన 83 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నవిషయం తెలిసిందే. 

click me!