IPL: బీసీసీఐకి కాసుల పంట‌.. మ‌రో ఐదేండ్లు ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా గ్రూప్

By Mahesh Rajamoni  |  First Published Jan 21, 2024, 5:42 PM IST

IPL Title Sponsor: ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్స‌ర్ గా మ‌రో ఐదేండ్ల పాటు టాటా సంస్థ కొన‌సాగ‌నుంది. 2022, 2023లో స్పాన్సర్‌గా ఉన్న ఈ సంస్థ  వచ్చే అయిదేళ్ల (2024-2028) కాలానికి స్పాన్సర్‌షిప్‌ హక్కులను ద‌క్కించుకుంద‌ని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొన్నాయి.
 


IPL Title Sponsor: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హ‌క్కుల‌ను మ‌రోసారి టాటా గ్రూప్ ద‌క్కించుకుంది. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజ‌న్ కు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ 17వ  సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. వివిధ జ‌ట్లు ఇప్ప‌టికే టీమ్స్ లోని ఖాళీల‌ను పూడ్చుకోవ‌డానికి గత ఏడాది డిసెంబరులో వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రికార్డులు న‌మోద‌య్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ అత్యధికంగా రూ.24.50 కోట్లకు వేలంలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. అలాగే, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం రూ.20.75 కోట్ల ధ‌ర ప‌లికాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న టాటా మోటార్స్ మరో ఐదేళ్ల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను నిలుపుకుంది. 2022 నుంచి 2023 వరకు రెండేళ్ల సీజ‌న్ కు టాటా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. అంతకు ముందు 2018 నుంచి 2021 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించిన వివో బీసీసీఐకి రూ.2,200 కోట్లు చెల్లించింది.

Latest Videos

undefined

INDIA VS ENGLAND: సిక్స‌ర్ల మోత‌.. ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌నున్న రోహిత్ శ‌ర్మ !

2022 నుంచి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న టాటా రూ.670 కోట్లు చెల్లించింది. గత ఏడాది డిసెంబర్ 12న పిలిచిన టెండర్ ప్రకారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐదేళ్ల పాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులకు బేస్ ప్రైస్ ను ఏడాదికి రూ.350గా నిర్ణయించింది. 2024 నుంచి 2028 వరకు రూ.500 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.2,500 కోట్లను టాటా గ్రూప్ చెల్లించి టైటిల్ స్పాన్ష‌ర్ షిప్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ మ్యాచ్ లను మరింత పెంచాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. 2025లో 84 మ్యాచ్లు, 2026, 2027లో 94 మ్యాచ్లు జరగనున్నాయ‌ని స‌మాచారం.

IND vs ENG: మీ ద‌గ్గ‌ర బాజ్ బాల్ ఉంటే మా ద‌గ్గ‌ర విరాట్ బాల్ ఉంది.. ఇంగ్లాండ్ కు సునీల్

click me!