క్రికెటర్ గా ధోని పని అయిపోయింది...: విశ్వనాథన్

By Arun Kumar PFirst Published Sep 13, 2019, 3:47 PM IST
Highlights

టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై చెస్ ఛాంపియన్ విశ్వనాథన్  ఆనంద్ ఆసక్తికర  వ్యాాఖ్యలు చేశాడు. ధోనికి క్రికెట్లో ఇంకా సాధించడానికి ఏమీ లేవని ఆనంద్ పేర్కొన్నాడు.  

అంతర్జాతీయ టెస్ట్ పార్మాట్ నుండి ఇప్పటికే రిటైరయిన ధోని పరిమిత ఓవర్ల  క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గతకొంతకాలంగా అతడు అన్ని ఫార్మాట్ల నుండి రిటైరయ్యే అవకాశముందంటూ ఓ ప్రచారం జరుగుతోంది. కానీ ధోని నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడటం లేదు. అయినప్పటికి నేడో, రేపో ధోని నుండి రిటైర్మెంట్ ప్రకటన వుంటుందన్న ఊహాగానాలు ప్రతిరోజూ అభిమానులనే కాదు మిగతా క్రీడాకారులను కూడా కన్ప్యూజ్ చేస్తున్నాయి. 

తాజాగా ధోని రిటైర్మెంట్ పై సాగుతున్న ఊహాగానాలపై భారత చెస్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్పందించాడు. ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేస్తూ ధోనిని ఒత్తిడిలోకి నెట్టవద్దంటూ అతడు వేడుకున్నాడు. నిజంగానే ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకుంటే స్వయంగా ప్రకటిస్తాడని...అంతవరకు అభిమానులు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలపై ఆసక్తి చూపించవద్దని ఆనంద్ సూచించాడు. 

''క్రికెటర్ గా ధోని కెరీర్ ఎంతో గొప్పగా సాగింది. అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో టీమిండియా కెప్టెన్ గానే కాకుండా ఉత్తమ వికెట్ కీపర్, అత్యుత్తమ బ్యాట్స్ మెన్, గేమ్ పినిషర్, వ్యూహకర్తగా ధోని చేయాల్సిందంతా చేశాడు. భారత జట్టుకు ఓ వన్డే, మరో టీ20 వరల్డ్ కప్ లు అందించాడు. కాబట్టి ఇంకా అతడు సాధించాల్సిందేమీ లేదు. క్రికెట్లో అతడు దాదాపు పరిపూర్ణత సాధించినట్టే. 

 భారత క్రికెట్ స్థాయిని పెంచిన ధోని గౌరవప్రదంగా క్రికెట్ కు వీడ్కోలు పలికేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై వుంది. కాబట్టి ఇకనైనా అతడి  రిటైర్మెంట్ పై వచ్చే తప్పుడు వార్తలను  ప్రచారం  చేయడం  ఆపేద్దాం.  ఎప్పుడు  రిటైరవ్వాలో అనుభవజ్ఞుడైన క్రికెటర్ గా అతడికి  తెలుసు. అతడి నుండి రిటైర్మెంట్  ప్రకటన  వెలువడే వరకు క్రికెట్ ప్రియులు సంయమనం పాటించాలి.''  అని చెస్ మాస్టర్ ఆనంద్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు 

ధోనీ రిటైర్మమెంట్ పుకార్లు: భార్య సాక్షి రియాక్షన్ ఇదీ...

ధోనీ రిటైర్మమెంట్ పుకార్లు: సమాచారం లేదన్న ఎమ్మెస్కే

ధోని నాకే ముచ్చెమటలు పట్టించాడు...: కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

 

click me!