భార‌త క్రికెట‌ర్ శిఖర్ ధావన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

By Mahesh Rajamoni  |  First Published Dec 26, 2023, 5:13 PM IST

Shikhar Dhawan: భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొడుకు జొరావర్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రేమను తెలుపుతూనే బాధను వ్యక్తం చేస్తూ ఎమోష‌న‌ల్ పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. త‌న కుమారుడిని త‌ల‌చుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 
 


Shikhar Dhawan's emotional post: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కుమారుడు జొరావర్ పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న ప్రేమ‌ను, బాధ‌ను వ్య‌క్తం చేస్తూ చేసిన ఒక పోస్టు వైర‌ల్ అవుతోంది. తనపై తనకున్న ప్రేమను, గత మూడు నెలలుగా తనను అస్సలు కాంటాక్ట్ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడితో గతంలో జరిపిన వీడియో కాల్ స్క్రీన్ షాట్ ను కూడా పోస్ట్ చేసిన ఈ క్రికెటర్ తన వద్ద కొత్త ఫొటో ఏదీ లేదని పేర్కొన్నాడు. త‌న కుమారుడిని చూడ‌నివ్వ‌డం లేద‌ని భావోద్వేగానికి గుర‌య్యాడు.

"నిన్ను ప్రత్యక్షంగా చూసి ఏడాది అవుతోంది. ఇప్పుడు, దాదాపు మూడు నెలలుగా నిన్ను చూడ‌నివ్వ‌డం లేదు. నన్ను అన్ని చోట్లా బ్లాక్ చేశారు. అందుకే అదే ఫోటోను పోస్ట్ చేస్తున్నా.., మై బాయ్, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీతో నేరుగా కనెక్ట్ కాలేనప్పటికీ, నేను  టెలీపతితో మీతో కనెక్ట్ అవుతాను. నేను మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను.. మీరు గొప్పగా రాణిస్తున్నార‌నీ, బాగా ఎదుగుతున్నారని నాకు తెలుసు" అని ధావన్ త‌న పోస్టులో పేర్కొంటున్నారు.

Latest Videos

అలాగే, 'నాన్న నిన్ను ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటాడు. భగవంతుని కృపతో మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం చిరునవ్వుతో ఎదురుచూస్తూ ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటాడు. ధైర్యంగా, సంతోషంగా ఉండండి. వినయంగా, దయతో, సహనంగా, బలంగా ఉండండి. మిమ్మల్ని చూడకపోయినా, నేను ప్రతిరోజూ మీకు సందేశాలు రాస్తాను, మీ శ్రేయస్సు, రోజువారీ జీవితం గురించి తెలుసుకుంటాను' అని పేర్కొన్నాడు.

 

కాగా, కొన్ని నెలల క్రితం క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్నారు. కోర్టు కుమారుడి క‌స్ట‌డీ త‌ల్లికి ఇవ్వ‌డంతో అత‌న్ని తీసుకునే ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లింది. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఎందుకు ఆడటం లేదు?

click me!