
India vs South Africa Live Score: సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మొదటి సెషన్ లోపే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ త్వరగానే ఔట్ అయ్యారు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అరంగేట్రం చేస్తున్న ఫైన్ లెగ్ ఫీల్డర్ బర్గర్ కు నేరుగా వెళ్లే పుల్ షాట్ ను రోహిత్ శర్మ ఆడటంతో అతనికి దొరికిపోయాడు. రబాడ బౌలింగ్ లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ క్రీజ్ లోకి వచ్చాడు.
ఇదే క్రమంలో మరో ఒపెనర్ యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి నాంద్రే బర్గర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ తన సత్తా చాటేందుకు శుభ్‌మన్ గిల్ కు ఇది మంచి అవకాశం. కానీ, అతను కూడా దీనిని ఉపయోగించుకోలేక పోయాడు. 2 పరుగులు చేసి నాంద్రే బర్గర్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. ఇలా మొదటి సెషన్ లోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారు.
ఇలాంటిది ఊహించలేదు గురు.. అందరినీ ఆశ్చర్యపరిచిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ !