INDW vs AUSW 1st T20: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు అదిరే ఆరంభాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.
INDW vs AUSW 1st T20: భారత్ - ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 141 పరుగులు చేసింది. భారత్ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది
ఆస్ట్రేలియాపై భారత్ మహిళల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. కంగారూ జట్టులో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 49 పరుగుల అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఎలిస్ పెర్రీ కూడా తన జట్టు 37 పరుగులు అందించారు. వీరిద్దరూ కాకుండా బెత్ మూనీ (17 పరుగులు), సదర్లాండ్ (12 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. భారత్ తరఫున టైటస్ సాధు అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. రేణుకా సింగ్, అమంజోత్ కౌర్‌లకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం 142 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ లు టీమిండియా తరుఫున అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 137 పరుగుల (93 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 16వ ఓవర్‌లో స్మృతి మంధాన 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైంది. మంధాన 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54 పరుగులు చేసింది. ఇది కాకుండా.. సహచర ఓపెనర్ షెఫాలీ వర్మ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. జెమీమా ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 17.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 145 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున జార్జియా వేర్‌హామ్ ఏకైక వికెట్ పడగొట్టారు.