డేవిడ్ వార్నర్ కు దొరికిన త‌న లక్కీ బ్యాగీ గ్రీన్ క్యాప్‌.. ఏం చేశాడో తెలుసా !

By Mahesh Rajamoni  |  First Published Jan 5, 2024, 4:01 PM IST

David Warner green cap: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ఎంతో ఇష్ట‌మైన, త‌న ల‌క్కీ స్టార్ గా భావించే బ్యాగీ గ్రీన్ క్యాప్ ను ఆస్ట్రేలియా-పాకిస్తాన్ రెండో టెస్టు సంద‌ర్భంగా ఎవ‌రో చోరీ చేశారు. అయితే, ఇప్పుడు ఆ గ్రీన్ క్యాప్ దొరికేసింది.
 


David Warner green cap: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో తన కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. తన కెరీర్‌లో పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ చివరి టెస్టు సిరీస్ అని వార్నర్ గత ఏడాది స్వయంగా ప్రకటించాడు. అలాగే, మూడో టెస్టు మ్యాచ్ కు ముందు, కొత్త సంవ‌త్స‌రం రోజున వ‌న్డేల‌కు కూడా గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అందిరినీ షాక్ గురిచేశాడు. ఇదిలావుండ‌గా, పాకిస్తాన్ తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ కు ముందు త‌న ల‌క్కీ స్టార్ గా భావించే డేవిడ్ వార్న‌ర్  బ్యాగీ గ్రీన్ క్యాప్ ను ఎవ‌రో దొంగిలించారు.

ఈ గ్రీన్ క్యాప్ గురించి వివ‌రిస్తూ డేవిడ్ వార్న‌ర్ చాలానే బాధ‌ప‌డ్డాడు. మూడో టెస్టు మ్యాచ్‌కు ముందు, వార్నర్ తన బ్యాగీ గ్రీన్ క్యాప్ (టెస్ట్) క్యాప్ పోయిందని చెబుతూ.. దానికి సంబంధించి ఒక  వీడియోను కూడా పోస్ట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నాడు. దానిని తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. త‌న‌కు ఆ క్యాప్ ఎంతో ల‌క్కీ అనీ, ఇష్ట‌మైన‌ద‌ని చెప్పాడు. ఆ వీడియో కాస్తా  చాలా వైరల్ అయ్యింది. అయితే,  తాజాగా డేవిడ్ వార్నర్ కు త‌న బ్యాగీ గ్రీన్ క్యాప్ దొరికింది. తాను బ‌స చేసిన హోట‌ల్ లోని ఒక ప్రాంతంలో క్యాప్ క‌నిపించింది. ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఒక వీడియోను పంచుకున్న డేవిడ్ వార్న‌ర్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు.

Latest Videos

undefined

డేవిడ్ వార్నర్ ఒరిజినల్ బ్యాగీ గ్రీన్ క్యాప్ ను పట్టుకుని ఉన్న ఒక వీడియోను శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్యాప్ ను కనుగొనడంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వీడియోలో డేవిడ్ వార్న‌ర్ మాట్లాడుతూ.. "హలో, నా బ్యాగీ గ్రీన్ క్యాప్ దొరికిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా మంచి శుభవార్త" అని పేర్కొన్నాడు. "ఈ క్యాప్ ను క‌నుగొన‌డానికి కృషి చేసిన‌ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. నేను చాలా కృతజ్ఞుడను.. రవాణా సంస్థ, హోటల్‌లు, టీమ్ మేనేజ్‌మెంట్ ధన్యవాదాలు" అని వార్న‌ర్ పేర్కొన్నాడు.ఏ క్రికెటర్‌కైనా తన టెస్ట్ క్యాప్ ఎంత ప్రత్యేకమైనదో త‌న‌కు తెలుసనీ, దానిని త‌న జీవితాంతం ఆదరిస్తానని చెప్పాడు.

కాగా, హోటల్‌లో (సిడ్నీలో) బ్యాగీ గ్రీన్ ఉంచిన బ్యాగ్‌లో అన్ని వస్తువులు ఉన్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒక‌రు తెలిపారు. అయితే, వారు దానిని ఎలా పొందారు అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. మంగళవారం నుంచి పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, వివిధ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తప్పిపోయిన బ్యాగ్ ఆచూకీ తెలియ‌లేదు. కానీ ఇప్పుడు అక్కడికి ఎలా చేరిందో తెలియడం లేదని ఆయన అన్నారు. ఈ వారం ప్రారంభంలో, మెల్‌బోర్న్ నుండి సిడ్నీకి ప్రయాణంలో, బ్యాగీ గ్రీన్ క్యాప్ ఉన్న డేవిడ్ వార్నర్ బ్యాగ్ కనిపించకుండా పోయింది.

బయటపడుతున్న శివాజీ అసలు రంగులు, రైతు బిడ్డ పరువు తీసేలా కామెంట్స్!

click me!