టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 9వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది.
T20 WC 2024: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్(ICC T20 World Cup 2024) షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లో జరుగుతుంది.
గ్రూప్ ఏ:
ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్టులు ఉన్నాయి.
గ్రూప్ బీ:
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ టీమ్‌లు ఉన్నాయి.
గ్రూప్ సీ:
న్యూజిలాండ్, వెస్ట్ ఇండీయస్, అఫ్గనిస్తాన్, ఉగాండ, పాపువ న్యూగినియా టీమ్‌లు ఉన్నాయి.
గ్రూప్ డీ:
సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ దేశాల టీమ్‌లు ఉన్నాయి.
గ్రూప్ స్టేజీలో టీమిండియా షెడ్యూల్:
ఇండియా వర్సెస్ ఐర్లాండ్ జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జూన్ 9 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ యూఎస్ఏ జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా వర్సెస్ కెనడా జూన్ 15 (ఫ్లోరిడా)
ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఇండియా క్వాలిఫై అయ్యాక.. సూపర్ 8 స్టేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. సూపర్ 8 మ్యాచ్‌లు జూన్ 19వ తేదీ నుంచి 24వ తేదీల మధ్య జరుగుతాయి. ఫస్ట్ సెమీ ఫైనల్స్ 26వ తేదీన(గయానా)లో, రెండో సెమీ ఫైనల్ 27వ తేదీన ట్రినిడాడ్‌లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లో జూన్ 29వ తేదీన జరగుతుంది.
ఫుల్ షెడ్యూల్ కోసం ఈ క్రింది బాక్స్ చూడండి..