విశాఖ వన్డే: కేఎల్ రాహుల్ మీద రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్య

By telugu teamFirst Published Dec 19, 2019, 12:38 PM IST
Highlights

విశాఖ వన్డేలో తనతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కెఎల్ రాహుల్ పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. బ్యాటింగ్ తీరును అభినందిస్తూనే వికెట్ల మధ్య పరుగు తీయడంపై వ్యాఖ్యానించాడు.

విశాఖపట్నం: తనతో పాటు ఓపెనర్ గా దిగుతున్న కేఎల్ రాహుల్ మీద టీమిండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. విశాఖపట్నంలో బుధవారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ కావడం వల్ల కలిసికట్టుగా ఆడాలని అనుకున్నట్లు ఆయన చెప్పాడు. 

అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగామని ఆయన చెప్పాడు. రోహిత్ శర్మ 138 బంతుల్లో 159 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ బాగా ఆడాడని, తనకు సమయం తీసుకోవడానికి వీలు కల్పించాడని అన్నాడు. 

Also Read: మేం చేసిన తప్పు అదే: ఇండియాపై ఓటమి మీద పోలార్డ్

ఎదురుగా ఉండి చూడడానికి బాగుంటుందని రోహిత్ శర్మ అన్నాడు. కేఎల్ రాహుల్ లో విశ్వాసం పెరుగుతోందని చెప్పాడు. కేఎల్ రాహుల్ తో భాగస్వామ్యం కొత్తదని అంటూనే వికెట్ల మధ్య పరుగు తీయడంలో అతను సరైన స్థాయిలో లేడని రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. 

అయినప్పటికీ తాము బాగా ఆడామని, భాగస్వామ్యం నెలకొల్పడాన్ని బట్టి తమలో విశ్వాసం పెరుగుతుందని అన్నాడు. వంద పరుగులు చేసిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అన్నాడు. చేయదలుచుకున్న పరుగులు చేసిన తర్వాత అవుటైనా ఫరవా లేదని అన్నాడు. 

Also Read: భారీ విజయం సరే కానీ, అదే బాధిస్తోంది: విరాట్ కోహ్లీ

తాను 200కు పైగా వన్డేలు ఆడానని, జట్టు కోసం ఎన్ని పరుగులు సాధ్యమైతే అన్ని పరుగులు చేయడం తన బాధ్యత అని రోహిత్ శర్మ అన్నాడు. మూడు వన్డే మ్యాచుల సిరీస్ లో వెస్టిండీస్, ఇండియా తలో మ్యాచు గెలుచుకోవడంతో సిరీస్ సమమైంది. దాంతో ఈ నెల 22వ తేదీన బారాబతి స్టేడియంలో జరిగే మూడో వన్డే కీలకంగా మారింది.

 వెస్టిండీస్ తో విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఇండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి, ఒత్తిడికి గురి చేసింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ సెంచరీలు చేయడమే కాకుండా కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో భారత్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 

click me!