విశాఖపట్నంలో జరిగిన రెెండో వన్డేలో ఇండియాపై ఓటమి మీద వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ స్పందించాడు. తాము బ్యాక్ ఎండ్ లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే తమ ఓటమికి కారణమని పోలార్డ్ అన్నాడు.
విశాఖపట్నం: ఇండియాపై విశాఖలో జరిగిన రెండో వన్డేలో తాము ఓటమి పాలు కావడంపై వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ స్పందించాడు.. బ్యాక్ ఎండ్ లో తాము విపరీతంగా పరుగులు ఇచ్చామని, అదే తాము చేసిన తప్పు అని ఆయన అన్నాడు.
తాము ముందు వేసుకున్న పథకాన్ని సరిగా అమలు చేయలేకపోయామని పోలార్డ్ అన్నాడు. తాము 40-50 పరుగులు తక్కువగా ఇచ్చి ఉంటే తేడా పడి ఉండేదని అన్నాడు. రోహిత్ శర్మ బాగా అడాడని, కేఎల్ రాహుల్ కూడా బాగా అడాడని ఆయన అన్నాడు.
undefined
Also Read: భారీ విజయం సరే కానీ, అదే బాధిస్తోంది: విరాట్ కోహ్లీ
రోహిత్, రాహుల్ బాగా ఆడడం వల్ల తర్వాత వచ్చిన భారత బ్యాట్స్ మెన్ కు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభించిందని, బ్యాక్ ఎండ్ నుంచి తమ నుంచి మ్యాచును లాగేసుకున్నారని ఆయన అన్నాడు. అయితే, తమపై విజయం సాధించాలంటే భారీ స్కోరు చేయాల్సి ఉంటుందనే విషయాన్ని తాము అర్థం చేయించామని అన్నాడు.
సరిగా వ్యూహాన్ని అమలు చేయడమే తాము చేయాల్సిందని ఆయన అన్నాడు. కొంత మంది యువకులున్నారని, కొంతమంది ప్రతిభ గలవారున్నారని, రాత్రికి రాత్రి అంతా జరిగిపోదని, ముక్కలను కలిపి పజిల్ పూర్తి చేయాల్సి ఉంటుందని, అప్పుడే ముందుకు సాగగలమని అన్నాడు.
Also Read: విశాఖలో రోహిత్ శర్మ వీరంగం...విండీస్ పై హుద్ హుద్ తరహా బీభత్సం
విరాట్ కోహ్లీ డకౌట్ కావడంపై ప్రశ్నించగా, దాని గురించి పెద్ద ఆలోచించలేదని, తుది మ్యాచులో కోహ్లీ బాగా ఆడుతాడని పోలార్డ్ అన్నాడు.
వెస్టిండీస్ తో విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఇండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి, ఒత్తిడికి గురి చేసింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ సెంచరీలు చేయడమే కాకుండా కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో భారత్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.