INDvsSL 2nd ODI: టాస్ గెలిచిన శ్రీలంక... కుల్దీప్ యాదవ్‌కి అవకాశం..

Published : Jan 12, 2023, 01:06 PM ISTUpdated : Jan 12, 2023, 01:17 PM IST
INDvsSL 2nd ODI: టాస్ గెలిచిన శ్రీలంక... కుల్దీప్ యాదవ్‌కి అవకాశం..

సారాంశం

India vs Sri Lanka 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. యజ్వేంద్ర చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం... 

టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఫీల్డింగ్ చేయనుంది. తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. అయితే భారత జట్టు 373 పరుగులు చేసిన తర్వాత కూడా బౌలర్లు 306 పరుగులు సమర్పించారు. ముఖ్యంగా స్పిన్నర్లు భారీగా పరుగులు సమర్పించారు. 

యజ్వేంద్ర చాహాల్ ఓ వికెట్ తీయగా అక్షర్ పటేల్‌కి ఒక్క వికెట్ కూడా దక్కలేదు... గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం దక్కింది. గౌహతితో పోలిస్తే కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఈ బౌన్సీ ట్రాక్‌పై రోహిత్ శర్మకు అద్బుతమైన రికార్డు ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ 173 బంతుల్లో  264 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు...

ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో సెంచరీ, టీ20ల్లో సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ గత రెండు వన్డేల్లో 50+ స్కోర్లు సాధించగా విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచుల్లోనూ 113 పరుగులు చేసి అదరగొట్టాడు...

కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తొలి వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెఎల్ రాహుల్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించినా హార్ధిక్ పాండ్యా 14 పరుగులు, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు...   

శ్రీలంక జట్టు కూడా రెండు మార్పులతో రెండో వన్డేలో బరిలో దిగుతోంది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన పథుమ్ నిశ్శంక, మోచేతి గాయం కారణంగా రెండో వన్డేకి దూరమయ్యాడు. అలాగే తొలి వన్డేలో అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం చేసిన మదుశంక, రెండో వన్డేలో చోటు దక్కించుకోలేకపోయాడు. వీరి స్థానంలో నువనిడు ఫెర్నాండో, లహిరు కుమారలకు తుదిజట్టులో చోటు దక్కింది...

 భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్

శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, నువనిడు ఫెర్నాండో, దసున శనక, వానిందు హసరంగ, చమికా కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !