
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈలో ఆఫ్ఘాన్‌తో జరగాల్సిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఆస్ట్రేలియా... 2023 మార్చి నెలలో యూఏఈ వేదికగా ఆఫ్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన ఈ సిరీస్ రద్ధు అయ్యింది... వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు, ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘాన్‌లో పర్యటించి అక్కడ వన్డే సిరీస్ ఆడాల్సింది.
అయితే ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయింది. ఆఫ్ఘాన్‌లో జరగాల్సిన వన్డే సిరీస్‌ని తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించాలని అనుకున్నారు...
అయితే తాలిబన్లు, ఆఫ్ఘాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత అక్కడ మహిళలు క్రీడల్లో పాల్గొనడాన్ని, ఉద్యోగానికి వెళ్లడాన్ని నిషేధించారు. ఇస్లాం మత ఆచారాల ప్రకారం మహిళలు శరీర భాగాలు కనిపించేలా బట్టలు వేసుకుని క్రీడల్లో ఆడకూడదని తేల్చింది. అలాగే బాలికల విద్యపై కూడా కఠినమైన ఆంక్షలు విధించింది..
మహిళా హక్కులను కాలదొక్కుతున్న ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారితో ఆడాల్సిన వన్డే సిరీస్‌ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఆస్ట్రేలియా. ఆసీస్ వన్డే సిరీస్ రద్దు చేసుకోవడంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో ఆఫ్ఘాన్‌కి 30 పాయింట్లు చేరతాయి..
ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుకి పూర్తి సపోర్ట్ ప్రకటించిన తాలిబన్లు, ఆఫ్ఘాన్ మహిళల జట్టును నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2021 చివర్లోనే పురుషులతో క్రికెట్ ఆడాలంటే, మహిళా క్రికెట్‌పై విధించిన బ్యాన్ ఎత్తివేయాలని ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.. అయితే తాలిబన్లు మాత్రం మహిళలు క్రీడలు ఆడుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు.
2021లో ఆఫ్ఘాన్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆస్ట్రేలియా. అయితే తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఈ టెస్టు మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు అయ్యింది. ఇప్పుడు ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కి కూడా రద్దు చేసుకుంది ఆస్ట్రేలియా.
ఆఫ్ఘాన్ క్రికెట్ మహిళా టీమ్‌పై నిషేధం పడడంతో ఐసీసీలో పూర్తి సభ్యత్వం కలిగిన జట్లలో మహిళా టీమ్ లేని బోర్డుగా ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు నిలిచింది. ఈ నెలలో ప్రారంభమయ్యే మొట్టమొదటి ఐసీసీ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆఫ్ఘాన్ మహిళా జట్టు పాల్గొనడం లేదు..