టీ20: ఆపరేషన్ హెయిర్ డ్రయ్యర్ ఫెయిలంటూ నెటిజన్ల ట్రోల్స్

By telugu teamFirst Published Jan 6, 2020, 10:02 AM IST
Highlights

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలవుతుందనగా వర్షం కురిసింది. దాదాపు అరగంటపాటు వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు సిబ్బంది. 

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిద్దామనుకున్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా పిచ్‌ తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

న్యూఇయర్‌ను విక్టరీతో స్టార్ట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ఆదివారం శ్రీలంకతో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌ రద్దుకు వర్షంతోపాటు మైదానం సిబ్బంది తప్పిదాలు కూడా కారణమయ్యాయి. పిచ్‌పై నీరు కారేలా నిర్లక్ష్య ధోరణితో సిబ్బంది వ్యవహరించడం వల్లే తొలి టీ20 జరగలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

AlsoRead గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం...

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలవుతుందనగా వర్షం కురిసింది. దాదాపు అరగంటపాటు వర్షం కురిసింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు ప్రయత్నించారు సిబ్బంది. 

అయితే... తడిచిన మైదానాన్ని హెయిర్ డ్రయ్యర్, రోలర్స్, ఐరన్ బాక్సులతో ఆర్పేందుకు ప్రయత్నించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా  వైరల్ అయ్యాయి. మ్యాచ్ ఆగిపోయిన సంగతి పక్కన పెడితే... మైదానాన్ని వారుు ఆర్పేవిధానంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

 బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘సీరియస్‌గా! ఇస్త్రీపెట్టెతో పిచ్ ఆరబెడుతున్నారా?’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, మరికొందరేమో పిచ్‌పై కప్పడానికి శ్రీలంక జట్టు తమతోపాటు కవర్లు తీసుకురావాల్సిందంటూ ఎగతాళి చేస్తున్నారు. ఈ కామెంట్లు చూస్తే ఇలా ఇస్త్రీపెట్టెలు, హెయిర్ డ్రైయర్స్‌తో పిచ్ ఆరబెట్టడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచేసిందని మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది.

తొలి మ్యాచ్‌ రద్దవడంతో ఈ సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే ఇరు జట్లు మిగిలిన 2 మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే... ఇప్పటివరకు టీ-20 ఫార్మాట్‌లో ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌లోనూ భారత్ ఓడిపోలేదు. కానీ... తొలి టీ20 రద్దవడంతో ఇపుడు మిగిలిన మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా ఆ రికార్డుకు గండి పడే అవకాశం ఉంది.

click me!