IND vs SA: టీమిండియాకు బిగ్ షాక్.. భారత్‌కు విరాట్ కోహ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఔట్.. !

By Mahesh Rajamoni  |  First Published Dec 22, 2023, 3:24 PM IST

Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్పటికే కీల‌క ప్లేయ‌ర్లు ఇండియా-సౌత్రాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి త‌ప్పుకోగా, తాజాగా విరాట్ కోహ్లీ కూడా దూరం అయ్యాడు. అలాగే, రుతురాజ్ గైక్వాడ్ కూడా సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు. 
 


India vs South Africa Test Series: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభానికి టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. మ‌రో ఇద్ద‌రు కీల‌క ప్లేయ‌ర్లు దూరం అయ్యారు. వారిలో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు ఉన్నారు. సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు జోరుగా ప్రాక్టిస్ చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. వేలి గాయం నుంచి ఇంకా కోలుకోక‌పోవ‌డంతో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.  ఇదే స‌మ‌యంలో భారత మాజీ కెప్టెన్, కింగ్  విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ కు దూరం అయ్యాడ‌ని స‌మాచారం. ఇప్పటికే విరాట్ తిరిగి స్వదేశానికి ప్ర‌యాణం అయ్యార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్యామిలీ అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి ప్ర‌యాణమ‌య్యాడు. దీంతో ప్రిటోరియాలో జ‌ర‌గ‌బోయే మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు.

Latest Videos

Year Ender 2023: ఇయర్ ఆఫ్ ది కింగ్.. విరాట్ కోహ్లీ !

భారత టెస్టు జట్టుతో దక్షిణాఫ్రికాలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే డిసెంబర్ 26 నుంచి ఆతిథ్య జట్టుతో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం ఈ దిగ్గజ బ్యాట్స్ మన్ దక్షిణాఫ్రికాకు తిరిగి వచ్చే అవకాశం ఉందని పీటీఐ రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ లో పాల్గొనే భారత జట్టులో సభ్యుడిగా కోహ్లీ దక్షిణాఫ్రికా వెళ్లాడు.

'ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ కోహ్లీ భారత్ కు తిరిగి వచ్చాడు. కానీ తొలి టెస్టు ప్రారంభానికి ముందే అతడు తిరిగి వస్తాడు' అని బీసీసీఐ వర్గాలు తెలిపిన‌ట్టు పీటీఐ నివేదిక‌లు పేర్కొన్నాయి. అయితే, మొదటి టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆడ‌తాడ‌ని అనుమాన‌మే. మరోవైపు వేలి ఫ్రాక్చర్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ కు దూరం కానున్నాడు. రింగ్ ఫింగర్ ఫ్రాక్చర్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. ఈ వారం ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో క్యాచ్ ప‌ట్టుకునే స‌మ‌యంలో  గైక్వాడ్ వేలికి గాయమైంది.

Yearender 2023: శుభ్‌మ‌న్ గిల్ నుంచి రింకూ సింగ్ వరకు.. టాప్-10 భార‌త క్రికెట్ రైజింగ్ స్టార్స్

click me!