IPL 2024: ఆదిల్ రషీద్ ఐపీఎల్ 2024 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. డిసెంబర్ 19న జరిగిన వేలంలో ఈ ప్రపంచ నెంబర్ ప్లేయర్ ఆదిల్ రషీద్‌ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు.
IPL 2024: ఇటీవల దుబాయ్ లోని కోకకోలా ఎరీనాలో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. పలువురు ఆటగాళ్లపై కనక వర్షం కురిపించాయి ఫ్రాంఛైజీలు. ఇదే సమయంలో స్టార్ ప్లేయర్లను పెద్దగా పట్టించుకోలేదు. అలాగే, అనామక, ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా అడని ప్లేయర్లను కోట్లు పెట్టి కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్ వేలం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. యూపీ స్టార్ సమీర్ రిజ్వీ ని రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేయగా, మరో శ్రీలంకన్ స్టార్ వనిందు హసరంగా కేవలం రూ.1.5 కోట్లకు తీసుకున్నారు. ఇక అమ్ముడుపోని ప్లేయర్లల్లో బిగ్ స్టార్స్ ఉన్నారు. గత మూడు రోజుల్లో రెండు టీ20 సెంచరీలు చేసిన ఫిల్ సాల్ట్ అతిపెద్ద సెంచరీ, మరో ఇంగ్లీష్ ప్లేయర్ ఆదిల్ రషీద్ కూడా పట్టించుకోకపోవడం సంచలనం కలిగిస్తోంది.
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 స్పిన్నర్‌లలో ఒకరైన రషీద్ గత సంవత్సరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉన్నాడు. ఈ వేలంలో అయితే 10 ఫ్రాంచైజీలలో దేని నుంచి కూడా ఎటువంటి స్పందన కనిపించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన వనీందు హసరంగా, మహ్మద్ నబీ మినహా విదేశీ స్పిన్నర్‌ల వైపు చూడలేదు. ఇది యాదృచ్చికమా లేదా మరేదైనా అనుకున్నా.. వేలం జరిగిన మరుసటి రోజే, అదిల్ రషీద్ T20లలో ప్రపంచ నెంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న T20 సిరీస్‌లో 7 కంటే తక్కువ ఎకానమీతో నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసిన రషీద్, మ్యాచ్‌లు రన్-ఫెస్ట్‌లు అయినప్పటికీ కరేబియన్‌లో అసాధారణమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ వేలంలో అమ్ముడుపోని క్రికట్ స్టార్ లలో ఆసీస్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఉన్నాడు. అలాగే, అకేల్ హోసేన్, కరుణ్ నాయర్, మైఖేల్ బ్రేస్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్‌లు కూడా ఉండటం విశేషం.
Adil Rashid became just the second England player to hold the top spot in the ICC Men's T20I rankings for bowlers 💪
More 👉 https://t.co/HgLG9OXlbF pic.twitter.com/uA0H2Iir5r