India vs South Africa Test series: భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరగనుంది.
India vs South Africa Test series 2023: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు సన్నద్ధమవుతున్న భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 నేపథ్యంలో కీలకమైన టెస్టు సిరీస్ కు ముందు వార్మప్ మ్యాచ్ కోసం భారత జట్టు రెండు జట్లుగా విడిపోయిన ప్రిటోరియాలోని సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడాయి. ఇదిలావుండగా, దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలుచుకోలేదు. అయితే, రాబోయే సిరీస్ ను ఎలాగైనా గెలుచుకోవాలని చేస్తోంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఎప్పుడు?
undefined
డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎలా?
భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా చూడవచ్చు. యాప్ తో పాటు వెబ్ సైట్ లో కూడా లైవ్ చూడవచ్చు.
భారత్, సౌతాఫ్రికా టెస్టు జట్లు..
భారత టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు:
టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోట్జీ, టోనీ డి జోర్జీ, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరైన్.
IND vs SA: టీమిండియాకు బిగ్ షాక్.. భారత్‌కు విరాట్ కోహ్లి.. రుతురాజ్ గైక్వాడ్ ఔట్.. !