టీ 20 ఫైనల్లో భారత్ విజయం

By Venugopal Bollampalli Editor  |  First Published Jun 29, 2024, 11:32 PM IST

ఏం మ్యాచ్ గురూ ఇది.. చివరి దాకా ఉత్కంఠతో సాగిన టీ 20 వరల్డ్ కప్ ఫైన్ పోరులో భారత్ గెలిచింది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లో అందరూ రాణించడంతో.. విజయం దక్కింది. 


ఏం మ్యాచ్ గురూ ఇది.. చివరి దాకా ఉత్కంఠతో సాగిన టీ 20 వరల్డ్ కప్ ఫైన్ పోరులో భారత్ గెలిచింది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లో అందరూ రాణించడంతో.. విజయం దక్కింది. దాదాపు 13 ఏళ్ల అనంతరం భారత్ వరల్డ్ కప్ గెలిచింది.

ఆరు ఓవర్లో ఆరు బంతులకు 16 పరుగులు.. హార్దిక్ పాండ్యా వేసిన మొదటి బాల్ కి మిల్లర్ సిక్సర్ ప్రయత్నించగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ తో మ్యాచ్ నే మలుపు తిప్పేశాడు. చివరకు ఈక్వేషన్ అయిదు బంతులకు 16 పరుగులు చేయాల్సి రాగా సౌతాఫ్రికా కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. భారత్ గెలిచింది. 

Latest Videos

సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసిన్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఫైనల్ మ్యాచ్ ని దాదాపు సౌతాఫ్రికా దక్కించుకున్నంత పని చేశాడు. దాదాపు రెండు వందల స్ట్రైక్ రేట్ తో 50 పరుగులకుపైగా చేసినా సౌతాఫ్రికా విజయం సాధించలేకపోయింది,

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 176 పరుగులకే పరిమితమైంది. ఎట్టకేలకు కింగ్ కోహ్లీ మెరిసినా విజయం మాత్రం దక్క లేదు. టోర్నీ ఆసాంతం పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో మెరిశాడు.మొత్తం 59 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు విరాట్. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీకి తోడు అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే ( 16 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (9), రిషభ్ పంత్ (0), సూర్య కుమార్ యాదవ్ (3) నిరాశ పర్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్టే తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాన్సెన్, రబాడా చెరో వికెట్ తీశారు.

 

click me!