IND vs SA 2nd ODIs:దక్షిణాఫ్రితో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా రెండో పోరుకు సిద్దమైంది. నేడు సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించింది సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు కసరత్తు చేస్తుంది. అయితే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పులు చేయనున్నందా? అనేది ప్రస్తుతం చర్చనీయంగా మారింది
IND vs SA 2nd ODIs: దక్షిణాఫ్రితో తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. రెండవ వన్డే మ్యాచ్ మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత జట్టు కసరత్తు చేస్తుంది. అయితే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పుతో టీమిండియా ఈ మ్యాచ్‌లోకి దిగుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ లో జరుగనున్న చివరి రెండు మ్యాచ్‌లకు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమైనట్టు తెలుస్తోంది. ప్రోటీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు శ్రేయస్ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రెండో వన్డేలో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ స్ధానంలో రింకూ సింగ్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అదే విధంగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ కుల్దీప్ విశాంత్రి తీసుకుంటే.. యుజువేంద్ర చాహల్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పేసర్ బర్గర్ స్ధానంలో లిజాడ్ విలియమ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ -
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్-
రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (c), హెన్రిచ్ క్లాసెన్ (WK), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్, వియాన్ ముల్డర్ , ఒట్నియల్ బార్ట్‌మాన్.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారతీయ అభిమానులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. ఇది కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా సులువుగా విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది.