IPL 2024: IPL 2024 వేలానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 19 మంగళవారం అంటే రేపు దుబాయ్ గడ్డపై IPL 2024 వేలం జరగనుంది. అయితే.. ఈ వేలానిక ఓ ప్రత్యేక ఉంది. ఈ సారి వేలాన్ని ఓ మహిళ నిర్వహించనున్నది. ఐపీఎల్ చరిత్రలో ఓ మహిళాను వేలం నిర్వాహకురాలు నియమించడం ఇదే తొలిసారి. IPL 2024 వేలాన్ని వేలంనిర్వాహకురాలు మల్లికా సాగర్ నిర్వహిస్తారు. ఇంతకీ మల్లిక సాగర్ ఎవరు? ఆమెను బీసీసీఐ ఎందుకు ఎంపిక చేసింది? ఆమె గతంలో వేలం నిర్వహించిన అనుభవం ఉందా? అనే ప్రశ్నలు వెలువిరుస్తున్నాయి. దీంతో కొంతమంది క్రికెట్ లవర్స్ నెట్టింట్లో ఆమె గురించి తెగ వెతికేస్తున్నారు.
IPL Auction 2024: భారతదేశంలో క్రికెట్ పండుగగా పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ వేలానికి వేలం నిర్వాహకురాలిగా మల్లికా సాగర్ అద్వానీని నియమించింది.
అంటే క్రీడాకారుల వేలం ప్రక్రియను మల్లికా సాగర్ అద్వానీ నిర్వహించనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఓ మహిళ వేలం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించడం ఎన్నడూ జరగలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తొలిసారిగా వేలం నిర్వహణ బాధ్యతను ఓ మహిళకు అప్పగించారు. ఇంతకీ మల్లిక ఎవరో తెలుసా? ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను ఎవరు వేలం వేస్తారు? మరి బీసీసీఐ ఆమెను ఎందుకు ఎంపిక చేసింది?
undefined
మల్లికా సాగర్ అద్వానీ ఎవరు?
ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వేలం వేసి, ఐపీఎల్‌లో తొలిసారి వేలంపాట వేసిన మల్లికా సాగర్ ముంబై నివాసి. ఆమె ఓ ఆర్ట్ కలెక్టర్. 'ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో' నివేదిక ప్రకారం.. మల్లికా సాగర్ తొలిసారిగా ఐపీఎల్‌లో వేలంపాటలో పాల్గొన్నప్పటికీ.. ఆమె గతంలో ప్రొ కబడ్డీ లీగ్‌లో వేలంపాటలో పాల్గొంది. 48 ఏళ్ల మల్లికాకు వేలంపాటలో 25 ఏళ్ల అనుభవం ఉంది. మల్లిక తన ఆర్ట్ హిస్టరీ స్టడీస్‌ని ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో పూర్తి చేసింది. ఆ తర్వాత 2001లో కేవలం 26 ఏళ్ల వయసులో వేలం కంపెనీ క్రిస్టీస్‌లో మల్లిక తన కెరీర్‌ను ప్రారంభించింది. దీంతో మల్లికా సాగర్ క్రిస్టీస్‌కు తొలి భారతీయ వేలం కర్తగా గుర్తింపు పొందింది. మల్లికా తన 25 ఏళ్ల అనుభవంలో ఎన్నో వేలంపాటలను నిర్వహించింది. ఆమె ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం వేలం నిర్వహించే పాత్రను కూడా పోషించింది. ఇది కాకుండా భారతదేశం వెలుపల నిర్వహించబడే మొదటి వేలం ఇది. IPL ప్రారంభం నుండి 2008 నుండి 2018 వరకు గడిచిన 10 సంవత్సరాలలో రిచర్డ్ మాడ్లీ IPL వేలాన్ని నిర్వహించాడు. అతని తరువాత అంటే 2018 తర్వాత.. హ్యూస్ ఆడమ్స్ IPL వేలం నిర్వహకుడిగా పనిచేశారు. కానీ ఇప్పుడు.. IPL 2024 మిని వేలం నిర్వాహకుడుగా మల్లికా సాగర్ ను బీసీసీఐ నియమించింది.
ఎవరో ఆ లక్కీ పర్సన్స్
IPL 2024 లో మొత్తం 333 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. అందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, 2 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉంటారు. మొత్తం ఆటగాళ్లలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 215 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 2 అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. మొత్తం 10 జట్లకు 77 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 333 మంది ఆటగాళ్లలో కేవలం 77 మంది ఆటగాళ్లకే అదృష్టం వరిస్తుంది. ఈ 77 స్లాట్‌లలో 30 స్లాట్‌లు విదేశీ ఆటగాళ్లకు చెందినవి. మొత్తం ఆటగాళ్లలో 23 మంది ఆటగాళ్లు ఉన్నారు, వీరి ప్రాథమిక ధర రూ.2 కోట్లు. ఇది కాకుండా.. అటువంటి 13 మంది ఆటగాళ్లు ఉన్నారు, వారి ప్రాథమిక ధర రూ. 1.5 కోట్లు.