అండర్-19 వరల్డ్ కప్: అదరగొట్టిన భారత బౌలర్లు, 172కే పాక్ ఖేల్ ఖతం

By Siva KodatiFirst Published Feb 4, 2020, 5:09 PM IST
Highlights

అండర్ -19 వరల్డ్ కప్‌లో భాగంగా పాచెఫ్ స్ట్రూమ్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో టీమిండియా ముందు పాకిస్తాన్ 173 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. 

అండర్ -19 వరల్డ్ కప్‌లో భాగంగా పాచెఫ్ స్ట్రూమ్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో టీమిండియా ముందు పాకిస్తాన్ 173 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కట్టుదిట్టమైన బంతులు విసురుతూ కట్టడి చేశారు.

Also Read:కోహ్లీ ఇమ్రాన్ ఖాన్ ను గుర్తు చేస్తున్నాడు: సంజయ్ మంజ్రేకర్

ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ హురైరా‌ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫహాద్ మునీర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఓపెనర్ హైదర్ అలీ 56 తో కలిసి కెప్టెన్ రోహాలీ నజీర్ 62 ఆచితూచి ఆడుతూ అప్పుడప్పుడు ఫోర్లు కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను జైస్వాల్ విడగొట్టాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హైదర్ అలీ రవి బిష్నోయికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కొద్దిసేపటికే ఖాసిమ్ అక్రమ్ 9 రనౌటయ్యాడు.

Also Read:కివీస్ పై వన్డే: కేఎల్ రాహుల్ కు తప్పని తలనొప్పి

ఇక అక్కడి నుంచి పాక్ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కెప్టెన్ నజీర్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటయ్యింది. భారత బౌలర్లలో ఎస్ఎస్ మిశ్రా 3, కార్తీక్ త్యాగి, రవి భిష్నోయి తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

click me!