కివీస్ పై వన్డే: కేఎల్ రాహుల్ కు తప్పని తలనొప్పి

By telugu teamFirst Published Feb 4, 2020, 3:00 PM IST
Highlights

టీ20లో ఓపెనర్ గా అదరగొట్టిన కేఎల్ రాహుల్ వన్డేల్లో మాత్రం మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగే చేయాల్సి వస్తోంది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ అతనికి ఓపెనింగ్ చాన్స్ రావడం లేదు.ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ ధ్రువీకరించాడు.

హామిల్టన్: న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ లో దంచికొట్టిన కేఎల్ రాహుల్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో నిర్దిష్టమైన స్థానం దొరకడం లేదు. న్యూజిలాండ్ పై జరిగే వన్డేలో రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇద్దరు లేకపోయినప్పటికీ కేఎల్ రాహుల్ కు వన్డేలో ఇన్నింగ్సును ప్రారంభించే అవకాశం ఇవ్వడం లేదు 

మాయంక్ అగర్వాల్, పృథ్వీషా ఇన్నింగ్సును ఆరంభిస్తారని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్ లో మాదిరిగానే రాహుల్ వికెట్ కీపింగ్ చేయడంతో పాటు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఆయన చెప్పాడు. 

also Read: కేఎల్ రాహుల్ కు షాక్: టెస్ట్ జట్టులో శుభ్మన్ గిల్, హనుమ విహారీ

పృథ్వీ షా ఎవరి స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ అతను ఇన్నింగ్సును ప్రారంభిస్తాడని, మాయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చాడని, అతను ఇన్నింగ్సును ప్రారంభిస్తాడని విరాట్ కోహ్లీ చెప్పాడు. కెఎల్ రాహుల్ ను ఐదో స్థానంలో రాణించే విధంగా చూడాలనేది తమ అభిమతమని ఆయన చెప్పాడు. 

రోహిత్ శర్మ లేకపోవడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని, తాము అందుకు సిద్ధపడ్డామని చెప్పాడు. రోహిత్ శర్మ సిరీస్ కు దూరం కావడం దురదృష్టకరమని ఆయన అన్నాడు. వన్డే, టీ20, టెస్టు క్రికెట్ ఏదైనా జాబితాలో తొలి స్థానంలో రోహిత్ శర్మ ఉంటాడని ఆయన అన్నాడు. అయితే వన్డే టోర్నమెంట్లు తమకు లేవు కాబట్టి ఫరవా లేదని అన్నాడు. 

ఆస్ట్రేలియా కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా దూరమవుతున్నాడని, ఇది ఆశ్చర్యకరమని విరాట్ కోహ్లీ అన్నాడు. భుజానికి గాయమైతే ఫీల్డింగ్ చేయడం కష్టంగా ఉంటుందని అన్నాడు. 

రోహిత్ శర్మ దూరమైన స్థితిలో మరొకరికి అవకాశం లభించిందని, కొత్తగా తుదిజట్టులోకి వచ్చినవారు ఏ మేరకు ఒత్తిడి తట్టుకుంటారనేది చూడడానికి వీలవుతుందని, దాన్ని వ్యతిరేక దృష్ఠితో చూడడానికి బదులు ఇతరులకు అవకాశం లభించినట్లు చూస్తున్నానని ఆయన అన్నాడు.

click me!