
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుపై భారీ ఆశలు, నమ్మకాలు ఉన్నాయి. అయితే తమపై అంత నమ్మకం పెట్టుకోవద్దని పరోక్షంగా తేల్చి చెప్పేసింది టీమిండియా. ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, 5 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ ముగ్గురూ అవుట్ కావడంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. ఆట 5 ఓవర్లు కూడా సాగకముందే వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆట నిలిచే సమయానికి 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది టీమిండియా. ఆట ప్రారంభమైన తర్వాత నాలుగో బంతికే రోహిత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 22 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు షాహీన్ ఆఫ్రిదీ.
తిరిగి ఆట ప్రారంభమైన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు షాహీన్ ఆఫ్రిదీ. ఈ ఓవర్‌లో టీమిండియా ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోవడంతో షాహీన్ ఆఫ్రిదీకి వికెట్ మెయిడిన్ ఓవర్ దక్కింది.
15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. నసీం షా బౌలింగ్‌లో ఫోర్ బాది ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ, షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకి ఆడుకున్నాడు. 27 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.
5 నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న శ్రేయాస్ అయ్యర్, 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. టీమిండియా నెమ్మదిగా కోలుకుంటున్నట్టు కనిపిస్తున్న సమయంలో హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌కి ప్రయత్నించిన శ్రేయాస్ అయ్యర్, ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
9.5 ఓవర్లలోనే 48 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. 11.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది టీమిండియా. ఈ సమయంలో మరోసారి వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు అంపైర్లు. క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ చేసే పరుగుల పైనే టీమిండియా స్కోరు ఆధారపడి ఉంది.