రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్! వాన ఆగగానే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Published : Sep 02, 2023, 04:15 PM ISTUpdated : Sep 02, 2023, 04:26 PM IST
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్! వాన ఆగగానే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

సారాంశం

2 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిదీ.. 11 పరుగులు చేసి రోహిత్ శర్మ, 4 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుట్.. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. 

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా కాసేపు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. తిరిగి ఆట ప్రారంభమైన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది టీమిండియా.  ఆట ప్రారంభమైన తర్వాత నాలుగో బంతికే రోహిత్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 22 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు షాహీన్ ఆఫ్రిదీ. 

ఈ ఓవర్‌లో టీమిండియా ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోవడంతో షాహీన్ ఆఫ్రిదీకి వికెట్ మెయిడిన్ ఓవర్ దక్కింది. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. నసీం షా బౌలింగ్‌లో ఫోర్ బాది ఖాతా తెరిచిన విరాట్ కోహ్లీ, షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకి ఆడుకున్నాడు. 27 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా.  

7 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది టీమిండియా. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికి ఫోర్ బాది, ఖాతా తెరిచాడు రోహిత్ శర్మ. అయితే స్వైర్ లెగ్‌లో ఫీల్డర్‌ చేతులను తాకుతూ బంతి బౌండరీకి వెళ్లడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. నసీం షా వేసిన రెండో ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ అవుట్ కోసం అప్పీల్ చేసింది పాకిస్తాన్. 

ఈ సంఘటన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురైన శుబ్‌మన్ గిల్, నసీం షా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 6 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.. ఈ ఓవర్‌లో వైడ్ రూపంలో ఓ ఎక్స్‌ట్రా మాత్రమే వచ్చింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే