కివీస్ విజయంలో కీలకపాత్ర: మన బుమ్రానేనా అంటున్న ఫ్యాన్స్

By Siva KodatiFirst Published Feb 5, 2020, 7:39 PM IST
Highlights

భారత ఓటమికి చెత్త ఫీల్డింగ్‌తో పాటు బౌలింగే కారణం. వీటన్నింటితో పోలిస్తే ముఖ్యంగా వైడ్లే టీమిండియా కొంప ముంచాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 347 పరుగులు చేసి కూడా దానిని కాపాడుకోలేకపోవడంతో టీమిండియా క్రికెటర్లపై విమర్శలు వస్తున్నాయి.

భారత ఓటమికి చెత్త ఫీల్డింగ్‌తో పాటు బౌలింగే కారణం. వీటన్నింటితో పోలిస్తే ముఖ్యంగా వైడ్లే టీమిండియా కొంప ముంచాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ మొత్తంలో కలిపి భారత బౌలర్లు 24 పరుగులు వైడ్ల రూపంలో కివీస్‌కు సమర్పించుకున్నారు.

Also Read:పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్

ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 13 వైడ్లు విసిరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. లైన్ లెంగ్త్‌తో బంతులు వేస్తూ.. ఓడిపోతామనుకున్న ఎన్నో మ్యాచ్‌లను బుమ్రా గెలిపించిన సందర్భాలు ఎన్నో.

ఇప్పటికీ అతని లయను అర్ధం చేసుకోలేకపోతున్నామని ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్లు చెప్పారు. అలాంటి బుమ్రా ఇలా అదనపు పరుగులు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

పరుగులను నియంత్రించడంలో బుమ్రా సక్సెస్ అయినప్పటికీ.. వైడ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. బుమ్రా ఒక్కడే కాకుండా షమి 7, శార్ధూల్ ఠాకూర్ 2, జడేజా, కుల్‌దీప్ చెరో వైడ్ వేసి ప్రత్యర్దికి కాస్త బరువును తగ్గించారు.

Also Read:అండర్ 19 వరల్డ్ కప్ : భారత్ చేతిలో పాక్ చిత్తు.. కారణం ఇదే

అయితే ఇక్కడ న్యూజిలాండ్ బౌలర్లు కూడా తక్కువేం తినలేదు.. వాళ్లు కూడా 19 వైడ్లు విసిరారు. గ్రౌండ్‌లో మంచు కురవడంతో బంతిపై పట్టు చిక్కడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.

భారత క్రికెట్ జట్టు ఇన్ని వైడ్లు వేయడం ఇదే తొలిసారి కాదు.. 1999లో బ్రిస్టల్‌లో కెన్యాపై 31, 2004 ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 28, 2007 ముంబైలో ఆసీస్‌పై 26, అదే ఏడాది చెన్నైలో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 వైడ్లు వేసింది. 
 

click me!