Ind Vs Nz: హమ్మయ్యా.. మ్యాచ్ మొదలైంది.. టాస్ గెలిచిన కోహ్లీ.. ఆ ఇద్దరికీ ఛాన్స్

By team teluguFirst Published Dec 3, 2021, 12:21 PM IST
Highlights

India Vs New Zealand: ఇండియా-కివీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టిన విరాట్ ఎట్టకేలకు టాస్ గెలిచాడు. ముంబై టెస్టుకు భారత్ తరఫున ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. 

ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగతున్న రెండో టెస్టులో  భారత సారథి విరాట్ కోహ్లీ (Virat kohli) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో విశ్రాంతి తీసుకున్న కోహ్లీ..  ముంబైలో జరుగుతున్న రెండో టెస్టులో తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. గత నాలుగైదు రోజులుగా ముంబై (Mumbai)లో  కురుస్తున్న వర్షాల కారణంగా వాంఖడే (Wankhede) పిచ్ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమైంది. దీంతో రెండు గంటలు ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్ లో ఇండియా (India) తొలుత  బ్యాటింగ్ చేయనుంది. 

ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి.  విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరగా..  గాయాలపాలైన ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అజింకా రహానే లు రెండో టెస్టుకు  దూరమయ్యారు. కెరీర్ లో 79 టెస్టులాడిన Ajinkya Rahane.. తన హోంగ్రౌండ్.. వాంఖడేలో తొలి టెస్టు ఆడాలని వేచి చూసినా కాలం కలిసిరాలేదు. దీంతో అతడికి మరోసారి నిరాశే ఎదురైంది. రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ స్థానాల్లో స్పిన్నర్ జయంత్ యాదవ్, పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడుతున్నారు. దీంతో భారత్.. తొలి టెస్టులో మాదిరే  ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. 

 

Let's Play!

Live - https://t.co/KYV5Z1jAEM pic.twitter.com/RIAThP6BEy

— BCCI (@BCCI)

ఇక New Zealand తరఫున  ఆ  జట్టు సారథి కేన్ విలియమ్సన్  భుజం గాయంతో తప్పుకున్నాడు. అతడి స్థానంలో డరిల్ మిచెల్  తుది జట్టులోకి ఎంపికయ్యాడు.  టామ్ లాథమ్ సారథ్య బాధ్యతలు మోస్తున్నాడు. ఈ టెస్టు లో కూడా కివీస్.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలో నిలిచింది. 

ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో సుమారు రెండు గంటల ఆట ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో.. ఆటగాళ్లు షెడ్యూల్ కంటే ముందే లంచ్ చేశారు. సెషన్ 1.. మధ్యాహ్నాం 12 గంటల నుంచి 2.40 గంటల దాకా ఉండగా.. రెండో సెషన్.. 3 నుంచి 5.30 గంటల దాకా నిర్వహించనున్నారు. 

తుది జట్లు :  భారత్ : మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్, టిమ్ సౌథీ, విలియమ్ సోమర్విల్లే, అజాజ్ పటేల్

click me!