Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ నన్ను దారుణంగా తిట్టేవాడు.. బాలీవుడ్ నటి తీవ్ర ఆవేదన

Published : Dec 02, 2021, 06:15 PM IST
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ నన్ను దారుణంగా తిట్టేవాడు.. బాలీవుడ్ నటి తీవ్ర ఆవేదన

సారాంశం

Shah Rukh Khan-Juhi Chawla: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. ప్రముఖ నటి జూహీ చావ్లాలు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే  పలు సందర్భాల్లో కంట్రోల్ కోల్పోతే మాత్రం షారుక్ తనను తిడతాడని జూహీ చెప్పింది. 

కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ ఆఫ్ స్క్రీన్ లో నిత్యం ప్రశాంతంగా కనిపిస్తాడు. కెమెరా ముందు గానీ వెనకాల గానీ ఈ బాలీవుడ్ (Bollywood) బాద్ షా కోప్పడటం చాలా అరుదు. అయితే షారుక్ (Shah Rukh Khan) మాత్రం తనను దారుణంగా తిట్టాడని ప్రముఖ బాలీవుడ్ నటి, కోల్కతా నైట్ రైడర్స్  (Kolkata knight Riders)సహా యజమాని జూహీ చావ్లా  (Juhi chawla) చెప్పింది. ఇటీవల ఓ షోలో పాల్గొన్న జూహీ చావ్లా..  ఏదైనా మ్యాచ్ చూసేప్పుడు కేకేఆర్ (KKR) ఓడిపోతే కంట్రోల్ కోల్పోతాడని, తనను తిడతాడని చెప్పుకొచ్చింది. 

హిందీలో ఫేమస్ అయిన కపిల్ (Kapil Talk show) టాక్ షో లో పాల్గొన్న జూహీ చావ్లా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ కేకేఆర్ ఆటగాళ్లు  సరిగా ఆడకుంటే నన్ను తిట్టేవాడు. ఏదైనా మ్యాచ్ జరుగుతుండగా.. ‘అరేయ్.. అతడేంటి అలా బౌలింగ్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ కు  తగ్గట్టు బంతి వేయాలి కదా. ఇది కరెక్ట్ కాదు.. నేను టీమ్ మీటింగ్ పెట్టాలి.. ’ అనేవాడు. అంతటితో ఆగకుండా నన్ను కూడా తిట్టేవాడు.. కానీ నాకు  ఆ సమయంలో ఏం చేయాలో తోచదు..’’ అని తెలిపింది.

 

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో కలిసి నటించిన  షారుక్ ఖాన్-జూహీ చావ్లాలు..  కేకేఆర్ జట్టుకు యజమాని, సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.   వీరిరువురి మధ్య వృత్తిపరమైన సంబంధాలే గాక.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. షారుక్ అభిమానించే అతికొద్ది మందిలో జూహీ చావ్లా ఒకరు. కాగా,  కపిల్ షోలో ఆమె ఫన్నీగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కాగా.. రెండు సార్లు ఐపీఎల్ (IPL) ట్రోఫీ సాధించిన కోల్కతా.. ఇటీవలే ముగిసిన 2021  సీజన్ లో ఫైనల్లో ఓడింది. భారత్ (India)లో జరిగిన తొలి దశలో పెద్దగా రాణించకపోయినా..  దుబాయ్ లో  మాత్రం అదరగొట్టింది. 

వెంకటేశ్ అయ్యర్,అభిషేక్ త్రిఫాఠి లతో పాటు సునీల్ నరైన్, శుభమన్ గిల్ వంటి  ఆటగాళ్ల సాయంతో ఆ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ముఖ్యంగా ఫైనల్ కు చేరడంలో అయ్యర్ పాత్ర  చాలా కీలకం. అది గుర్తించిన కేకేఆర్ యాజమాన్యం.. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అతడిని భారీ రేటుకు ఇచ్చి దక్కించుకుంది. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో అయ్యర్ కు రూ. 8 కోట్లు ఇచ్చి నిలుపుకున్న కేకేఆర్.. అతడితో పాటు వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లను కూడా అట్టిపెట్టుకుంది.  

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు