INDvsNZ 3rd ODI: మూడో వన్డేలోనూ టాస్ ఓడిన శిఖర్ ధావన్... మరోసారి వర్షం అంతరాయం...

By Chinthakindhi RamuFirst Published Nov 30, 2022, 6:52 AM IST
Highlights

India vs New Zealand 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... మరోసారి మ్యాచ్‌కి వర్షం అంతరాయం..

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా క్రిస్ట్‌చర్చిలో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. మరోసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా వరుసగా మూడో వన్డేలోనూ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఒక్క టాస్ కూడా గెలవకపోవడం విశేషం.

తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన రెండు టీ20ల్లో హార్ధిక్ పాండ్యా టాస్ ఓడిపోయాడు. శిఖర్ ధావన్ మూడు వన్డేల్లోనూ టాస్ ఓడిపోయాడు. భారత జట్టును వర్షం వదలడం లేదు. ఇప్పటిదాకా కివీస్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచులు ఆడగా సజావుగా సాగి ఫలితం తేలిన మ్యాచులు రెండంటే రెండు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టీ20 నుంచి హామిల్టన్‌లో జరిగిన రెండో వన్డే వరకూ ప్రతీ నగరంలోనూ వాన ఆటకు అంతరాయం కలిగించింది..

హామిల్టన్‌లో రెండో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా క్రిస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న మూడో వన్డేని కూడా వాన వదలడం లేదు. బుధవారం మధ్యాహ్నం వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. వర్షం కారణంగా టీ20 సిరీస్‌ని లక్కీగా 1-0 తేడాతో  కైవసం చేసుకున్న టీమిండియా, వన్డే సిరీస్‌ని మాత్రం కోల్పోయే ప్రమాదంలో పడింది...

తొలి వన్డేలో ఓడిన టీమిండియా, ఈ మ్యాచ్ రద్దు అయితే 1-0 తేడాతో వన్డే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. రెండో వన్డేలో మార్పులు లేకుండా బరిలో దిగుతోంది టీమిండియా. రెండో వన్డేలో టీమ్‌లో చోటు కోల్పోయిన సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ రిజర్వు బెంచ్‌‌కే పరిమితం కాగా వారి స్థానాల్లో దీపక్ హుడా, దీపక్ చాహార్ ఆడబోతున్నారు... న్యూజిలాండ్ జట్టు బ్రాస్‌వెల్ స్థానంలో ఆడమ్ మిల్నేని తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. 

న్యూజిలాండ్ జట్టు:  ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్ (కెప్టెన్), డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్,శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్ 

click me!