India vs England: 'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మూడో టెస్టులో ఉంటారని' పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
India vs England : టీమిండియాకు, క్రికెట్ లవర్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్-భారత్ టెస్టు సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రారంభ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టుతో పాటు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అయితే, మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు.
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జట్టును అతి త్వరలో ప్రకటించనుంది. భారత్-ఇంగ్లాండ్ 3వ టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జస్ప్రీత్ బుమ్రా రాబోయే టెస్ట్‌కు బెంచ్‌లో ఉంచవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వైజాగ్ టెస్టు తర్వాత మహ్మద్ సిరాజ్ బహుశా 3వ టెస్టుకు తిరిగి రావచ్చు. అయితే, విరుష్క దంపతులు రెండో సంతానం కోసం ఎదురుచూస్తుండటంతోనే కోహ్లీ ఈ టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. కోహ్లీ నుంచి సమాచారం ఇచ్చిన వెంటనే జట్టులోకి వస్తాడని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
హెలికాప్టర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !
అయితే, క్రిక్‌బజ్ నివేదికల ప్రకారం.. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి సెలవు తీసుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే మిగతా టెస్టులకు కూడా అందుబాటులో ఉండడు. విరాట్ ఎందుకు ఈ సిరీస్ కు అందుబాటులో లేడనే దానిపై అనేక ప్రశ్నలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఆసక్తికరంగా ఈ వారం ప్రారంభంలో దిగ్గజ క్రికెట్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, విరాట్ కోహ్లి సన్నిహితుడు ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. అయితే, దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. కోహ్లీగానీ, బీసీసీఐగానీ స్పందించలేదు.
రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తిరిగి వస్తున్నారు...
రెండో టెస్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముంది. అయితే, వారి ఫిట్‌నెస్‌కు సంబంధించి నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) ఇంకా అప్‌డేట్ ఇవ్వలేదు. అందువల్ల, దేశంలోని అత్యున్నత అకాడమీ తుది అంచనా తర్వాత ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరు వైజాగ్ టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
Under 19 World Cup: సెమీస్ లో పాకిస్తాన్ చిత్తు.. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు