ఇంగ్లాండ్ పై భారత మహిళా టీం అద్భుత విజయాన్ని అందుకుంది. మహిళా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీని టీమిండియా మహిళా జట్టు సాధించింది.
హైదరాబాద్ : ప్రస్తుతం పురుషుల క్రికెట్ లోనే కాదు మహిళల క్రికెట్ లోనూ టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత మహిళా క్రికెటర్లు అరగొట్టారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సత్తాచాటిన మహిళా క్రికెటర్లు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇంగ్లాడ్ ను వారి స్వదేశంలోనే మట్టికరింపించిన హర్మన్ సేన 347 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మహిళ టెస్ట్ క్రికెట్ లో ఏ జట్టుకయినా ఇదే అతిపెద్ద విజయం.
నిన్న (శనివారం) భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడోరోజు టెస్ట్ మ్యాచ్ కొనసాగింది. భారత ఉమెన్స్ టీం రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఆతిథ్య జట్టు ముందు 479 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. భారీ లక్ష్యఛేదనలో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో మహిళల టెస్ట్ క్రికెట్ లో అతిపెద్ద విజయాన్ని అందుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది.
Laughter, banter & joy! ☺️ 😎
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 right after 's historic Test win over England 👏 👏
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 🎥 🔽 | pic.twitter.com/eUux8ukSNQ
undefined
ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 428 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మాత్రం కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక్కడే ఇంగ్లాండ్ ఓటమి ఖాయమయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 186 పరుగులకే డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది భారత మహిళా టీం. సెకండ్ ఇన్పింగ్స్ లోనూ అదే పేలవ ఆటతీరు ప్రదర్శించిన ఇంగ్లాండ్ కనీస పోరాటపటిమ చూపించలేకపోయింది. ఇంగ్లీష్ బ్యాట్ ఉమెన్స్ లో హీతర్ నైట్ 21 పరుగులే అత్యధిక స్కోర్ అంటే ఆ టీం ఆట ఎలాసాగిందో అర్థంచేసుకోవచ్చు.
కేవలం మూడు రోజుల్లోనే భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ముగిసింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ దీప్తి శర్మ (9 వికెట్లు, 89 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో సతీష్ శుభ 69, రోడ్రిగ్స్ 68, యస్తికా భాటియా 66, దీప్తి శర్మ 69 పరుగులతో అదరగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ హర్మత్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.
మహిళా టెస్ట్ క్రికెట్ లో 309 పరుగులే అత్యధిక విన్నింగ్ స్కోరు. ఈ రికార్డు ఇంతకాలం శ్రీలంక పేరిట వుంది. తాజాగా టీమిండియా మహిళా టీం 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ను ఓడింది ఆ రికార్డును బద్దలుగొట్టింది.