IND vs SA: నేటీ నుంచి వన్డే పోరు షూరు..  బ్యాటింగ్ ఆర్డర్ మారనున్నదా? ఓపెనర్లు వారేనా? 

By Rajesh Karampoori  |  First Published Dec 17, 2023, 3:33 AM IST

IND vs SA:కేఎల్ రాహుల్  కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనివార్యం కానున్నది. ఈ పరిస్థితిలో రితురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ భారత్‌కు ఓపెనింగ్ బాధ్యతలు తీసుకుంటే.. తదుపరి బ్యాటింగ్ ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారనున్నది.  


IND vs SA:భారత్ వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేటీతో ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వన్డే జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్డ్ పై కీలక మార్పు చేయనున్నట్టు తెలిపారు. తాను , సంజూ శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తారు. సంజూ శాంసన్ 5 లేదా 6లో ఆడగలడని, తాను కూడా మిడిల్ ఆర్డర్‌లో ఉంటాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ సందర్భంగా రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు కూడా తీసుకుంటానని చెప్పినా ఓపెనింగ్‌ వికెట్‌ ఎవరు చేస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.

రీతురాజ్ సాయి- సుదర్శన్ ఓపెనింగ్
 
వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ లేదా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయకపోవడం ఖాయం. కానీ,కేఎల్ రాహుల్  కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడంతో బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనివార్యం అనిపిస్తోంది. ఈ పరిస్థితిలో రితురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ భారత్‌కు ఓపెనింగ్ బాధ్యతలు నిర్వహించవచ్చు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఓపెనర్లుగా కనిపిస్తున్నారు. వీరిలో సంజు మిడిల్ ఆర్డర్‌లో ఆడనుండగా, మిగిలిన వారు రితురాజ్ , సాయి సుదర్శన్, అంటే వారిద్దరూ ఓపెనింగ్ చేస్తారు. ఇదే జరిగితే ఈ మ్యాచ్ ద్వారా సాయి సుదర్శన్ వన్డే ఫార్మాట్‌లో కూడా అరంగేట్రం చేయవచ్చు.

Latest Videos

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తే, ఈ పరిస్థితిలో శ్రేయాస్ అయ్యర్ మూడో స్థానంలో, కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో రావచ్చు. ఇక రింకూ సింగ్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేయగా, సంజూ శాంసన్ ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఏడో స్థానంలో బ్యాటింగ్ రావచ్చు. బౌలింగ్ విభాగానికి వస్తే.. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా జట్టులో ఉంటాడు, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్., అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లుగా కనిపిస్తారు.

భారత వన్డే జట్టు

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, వాషింగ్టన్ సుందర్, అర్షింగ్టన్ సుందర్, ఆకాశ దీప్.
 

click me!