Suryakumar Yadav: ఐపీఎల్ 2024 కోసం రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్‌గా రోహిత్ వైదొలగడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్పందన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమని కామెంట్ చేశారు? మీరు కూడా ఓ లూక్కేయండి.
Suryakumar Yadav: ఐపీఎల్ 2024 కోసం రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్‌గా రోహిత్ వైదొలగడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్పందన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమని కామెంట్ చేశారు? మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి శుక్రవారం ఓ సంచలన లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఈ లీగ్‌లో టాప్ సక్సెస్ రేట్ ఉన్న ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. హార్దిక్ ఇటీవలే గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడయ్యాడు. ఈ నిర్ణయం అభిమానులతో పాటు తోటీ ఆటగాళ్లను కూడా ఆశ్చర్యపరిచింది. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యాను వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమాయ్యాయి. కెప్టెన్సీ మార్పు వార్తను ప్రకటించిన తర్వాత.. రోహిత్ ఒక భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు..రోహిత్ శర్మను తొలగించడం పట్ల అభిమానులు చాలా కోపంగా ఉన్నారు
ఈ తరుణంలో శనివారం ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయ విదారక ( హార్ట్ బ్రోకెన్) ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం తనకు కూడా నచ్చలేదని పరోక్షంగా వెల్లడించాడు. నిజానికి సూర్య కుమార్ యాదవ్ ఎలాంటి కామెంట్స్ కేవలం బ్రోకెన్ హర్ట్ సింబల్ పెట్టి.. తన అసంత్రుప్తిని వెల్లడించారు.
సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ ఎంతో అండగా నిలిచాడు. పరోక్షంగా రోహిత్ శర్మ చొరవతో సూర్యకుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఏంట్రీ ఇచ్చారు. శుక్రవారం ఒక ప్రకటనలో ముంబై ఇండియన్స్ నాయకత్వంలో మార్పు తమ భవిష్యత్ ప్రణాళికలలో భాగమని, ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవకు రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రోహిత్ కెప్టెన్సీలో రాణించిన ముంబై
చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన IPL ఫ్రాంచైజీలు, రెండూ ఒక్కొక్కటి ఐదు టైటిల్స్ గెలుచుకున్నాయి. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌కు రోహిత్ నాయకత్వం వహించాడు. ఫ్రాంచైజీ తన మొదటి IPL టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు అతను 2013లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రారంభించాడు. ఆయన కెప్టెన్సీలోనే ముంబాయి ఐదు ఐపిఎల్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
రోహిత్ కెప్టెన్సీలో ఇతర టైటిల్స్ 2015, 2017, 2019, 2020లో వచ్చాయి. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. MI సహాయక సిబ్బందిలో ఒకరైన శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.2013 నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతని పదవీకాలం అసాధారణమైనది కాదు. ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ ఒకడు.అతని నాయకత్వం జట్టుకు అపూర్వ విజయాన్ని అందించడమే కాకుండా ఐపిఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసిందని జయవర్ధనే అన్నారు.
అతని మార్గదర్శకత్వంలో MI అన్ని కాలాలలో అత్యంత విజయవంతమైన , ప్రియమైన జట్లలో ఒకటిగా మారింది. MIని మరింత బలోపేతం చేయడానికి మైదానంలో, వెలుపల అతని మార్గదర్శకత్వం, అనుభవం కోసం మేము ఎదురుచూస్తున్నామని అన్నారు.
రోహిత్ భవిష్యత్తు?
ఈ పరిణామం తరువాత రోహిత్ భవిష్యత్తుపై పలు అనుమానాలు వస్తున్నాయి. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో 36 ఏళ్ల గుండె పగిలిపోయింది. మరో ODI ప్రపంచకప్‌లో పాల్గొనడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే అతను ఆరు నెలల తర్వాత T20 ప్రపంచ కప్‌లో భారతదేశానికి నాయకత్వం వహించడానికి తిరిగి రావచ్చు. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓటమి తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో ఆడలేదు.