India vs England: సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ‌కు తెర‌.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తండ్రి.. ఎందుకంటే..?

Published : Feb 15, 2024, 12:48 PM IST
India vs England: సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ‌కు తెర‌..  కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తండ్రి.. ఎందుకంటే..?

సారాంశం

India vs England : భారత్-ఇంగ్లాండ్ 3వ టెస్టు వేదిక అయిన రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్‌ను చూసేందుకు అతని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ధృవ్ జురెల్ కూడా ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు.   

Sarfaraz Khan's father Naushad Khan sheds tears: సుదీర్ఘ నిరీక్షణ తెర‌ప‌డింది. దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొడుతున్నా టీమిండియా పిలుపు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఎట్ట‌కేల‌కు భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో అత‌ను టీమిండియా త‌ర‌ఫున అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్‌కి పిలుపు రావడం ఆలస్యం అయింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆహ్వానించబడినప్పటికీ, 26 ఏళ్ల యువకుడు మూడో టెస్టు వరకు వేచి ఉండాల్సి వచ్చింది. అందుకే సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం ఉద్వేగభరితంగా మారింది.

సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు వేదిక అయిన రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి సర్ఫరాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సర్ఫరాజ్‌కు టెస్టు క్యాప్ అందించాడు. సర్ఫరాజ్ తండ్రి, స్టార్ కోచ్ అయిన నౌషాద్ ఖాన్ త‌న కొడుకు అరంగేట్రం చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. సర్ఫరాజ్ భారత టోపీని ముద్దాడిన తర్వాత నౌషాద్ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయంతో జ‌ట్టుకు దూరం కావ‌డంతో సర్ఫరాజ్ ఖాన్‌కు మూడో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

 

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 66 ఇన్నింగ్స్‌ల్లో 69.85 సగటుతో 14 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 3912 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 301* నాటౌట్. రంజీ ట్రోఫీలో గత మూడు సీజన్‌లలో 100కి పైగా సగటుతో ప‌రుగులు చేయ‌డం విశేషం. ముంబయి తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఆరు మ్యాచ్‌లలో 154.66 సగటుతో 301, 226, 177 ఇలా అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో 928 పరుగులు చేసిన త‌ర్వాత అత‌నికి  భార‌త జ‌ట్టులో చోటుక‌ల్పించాల‌నే డిమాండ్ బలంగా ఉంది. సర్ఫరాజ్ ఖాన్ 2021-22 సీజన్‌లో 122.8 సగటుతో ఆరు మ్యాచ్‌ల్లో 982 పరుగులు, 2022-23 సీజన్‌లో 107.8 సగటుతో 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు చేశాడు. ఈ మూడు సీజన్లలో సర్ఫరాజ్ 9 సెంచరీలు కొట్టాడు.

IND VS ENG : క‌ష్ట స‌మ‌యంలో కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది