India vs England: అశ్విన్-జ‌డేజా జోడీ చెత్త రికార్డు..

By Mahesh Rajamoni  |  First Published Jan 28, 2024, 1:05 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్  రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. భార‌త్ ముందు 231 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే, తొలి ఇన్నింగ్స్ లో అద‌ర‌గొట్టిన ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు రెండో ఇన్నింగ్స్ లో చెత్త‌రికార్డును న‌మోదుచేశారు. 


IND v ENG - Rohit Sharma fan: హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో  భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్ల‌లో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3, ర‌వీంద్ర జ‌డేజా 2 వికెట్లు తీసుకున్నారు. ఇదే క్ర‌మంలో భార‌త స్పిన్న‌ర్లు చెత్త రికార్డును న‌మోదుచేశారు.

రెండో ఇన్నింగ్స్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజాలు వ‌రుస‌గా 3,2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో జ‌డేజా, అశ్విన్ లు మూడేసి వికెట్లు తీసుకుని భారీ స్కోర్ చేయ‌కుండా ఇంగ్లాండ్ ను అడ్డుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. అశ్విన్, జ‌డేజాల జోడీ రెండో ఇన్నింగ్స్ లో చెత్త రికార్డును న‌మోదుచేసింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 126 ప‌రుగులు, జ‌డేజా 131 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. భార‌త్ ఆడిన మ్యాచ్ ల‌లో ఈ స్పిన్ జోడీ సెకండ్ ఇన్నింగ్స్ లో 100కు పైగా ప‌రుగులు ఇవ్వ‌టం ఇదే తొలిసారి. ఇక ఈ టెస్టులో మొత్తంగా ర‌విచంద్ర‌న్ అశ్విన్ 6 వికెట్లు, ర‌వీంద్ర‌ జ‌డేజా 5 వికెట్లు తీసుకున్నారు.

Latest Videos

undefined

 

Lunch on Day 4 in Hyderabad 🍱

England are all out for 420 and need 2⃣3⃣1⃣ to win 🙌

Stay tuned for the second session ⏳

Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E | | pic.twitter.com/E8axUcu3lj

— BCCI (@BCCI)

తొలి టెస్టులో ఇంగ్లాంగ్ తొలి ఇన్నింగ్స్ లో 246 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 420 ప‌రుగులు చేసింది. టీమిండియా ముందు 231 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 436 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ను 42/2 (12 ఓవ‌ర్లు) ప‌రుగుల‌తో కొన‌సాగిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్ లు నిరాశ‌ప‌రిచారు. 

 

Shubman Gill dismissed for duck. pic.twitter.com/bCQ3AtlNDr

— Johns. (@CricCrazyJohns)

 

 

click me!