India vs England: రాజ్‌కోట్ టెస్టు.. భార‌త్ కు మార్క్ వుడ్ షాక్.. జైస్వాల్, గిల్, ప‌టిదార్ ఔట్..

By Mahesh Rajamoni  |  First Published Feb 15, 2024, 10:35 AM IST

India vs England : రాజ్ కోట్ లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూటో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్క‌డి పిచ్ తొలి మూడు రోజులు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ, తొలి సెషన్ లో  ఇంగ్లాండ్ బౌలర్లు 3 వికెట్లు తీసి భారత్ ను దెబ్బకొట్టారు. 
 


India vs England 3rd Test: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొద‌టి రెండు టెస్టుల్లో చెరో ఒక మ్యాచ్ గెలిచిన భార‌త్-ఇంగ్లాండ్ లు 1-1తో సిరీస్ ను స‌మం చేశాయి. మూడో టెస్టులో విజ‌యం సాధించి అధిక్యంలోకి వెళ్లాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. తొలి సెషన్ లోనే భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు నాలుగో ఓవ‌ర్ లోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అయితే, ఈ సిరీస్ లో ఇప్ప‌టికే డ‌బుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన య‌శ‌స్వి జైస్వాల్ 4వ ఓవ‌ర్ లో మార్క్ వుడ్ బౌలింగ్ లో జోరూట్ క్యాచ్ గా దొరికిపోయాడు.

అలాగే, రెండో టెస్టులో సెంచ‌రీతో భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన శుభ్ మ‌న్ గిల్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు చేరాడు. 6 ఓవ‌ర్ లోని 4 బంతికి గిల్ ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 9 బంతులు ఎదుర్కొన్న శుభ్‌మ‌న్ గిల్.. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎదుర్కొవ‌డానికి ఇబ్బంది ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే ఫోక్స్ కు క్యాచ్ గా దొరికిపోయాడు. గిల్ ఔట్ కాగానే మ‌రో ఎండ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశగా కనిపించాడు. ఈ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ర‌జ‌త్ ప‌టిదార్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయాడు. 5 ప‌రుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్ లో బెన్ డ‌కెట్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి అరగంటలో మూడు వికెట్లు కోల్పోయిన భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజాలు క్రీజులో ఉన్నారు. 

Latest Videos

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

కాగా, మ్యాచ్ తో  టీమిండియా త‌ర‌ఫున ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ ఇచ్చారు. దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొట్టిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లు టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు.   

భార‌త్ జ‌ట్టు: యశస్వి జైస్వాల్ , రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్ మ‌న్ గిల్, రజత్ పాటిదార్ , సర్ఫరాజ్ ఖాన్ , రవీంద్ర జడేజా , ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్), రవిచంద్రన్ అశ్విన్ , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, 

ఇంగ్లాండ్ స్క్వాడ్: జాక్ క్రాలీ , బెన్ డకెట్ , ఒల్లీ పోప్ , జో రూట్ , జానీ బెయిర్‌స్టో , బెన్ స్టోక్స్ (కెప్టెన్) , బెన్ ఫోక్స్ (వికెట్ కీప‌ర్) , రెహాన్ అహ్మద్ , టామ్ హార్ట్లీ , మార్క్ వుడ్ , జేమ్స్ ఆండర్సన్.

INDIA VS ENGLAND: ఇంగ్లాండ్ పై టాస్ గెలిచిన భార‌త్.. ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ.. !

click me!