India vs England: ఇంగ్లాండ్ పై టాస్ గెలిచిన భార‌త్.. ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 15, 2024, 9:42 AM IST

India vs England : అనుకున్న విధంగానే దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొట్టిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లు టీమిండియా త‌ర‌ఫును టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. రాజ్ కోట్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. బౌలింగ్ మెరుపులు క‌నిపించ‌వ‌చ్చని పిచ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 


India vs England 3rd Test: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా త‌ర‌ఫున ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్లు ఎంట్రీ ఇచ్చారు. దేశ‌వాళీ క్రికెట్ లో అద‌ర‌గొట్టిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లు టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "మేము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. జట్టులో కొన్ని మార్పులు చేశాం. టీమో నాలుగు మార్పులు చేయగా, ఇద్దరు ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ అరంగేట్రం చేస్తున్నారు. అలాగే,  సిరాజ్, జడేజా మళ్లీ జట్టుతో చేరారు. అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ తప్పుకున్నారు. మంచి పిచ్‌గా కనిపిస్తోంది, మేము ఆడిన చివరి రెండింటి కంటే మెరుగ్గా ఉంది. రాజ్‌కోట్‌ మంచి పిచ్‌గా ఉంది కాబట్టి కుర్రాల్లో భారీగా పరుగులు చేస్తామని" చెప్పాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. "మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాల‌ని అనుకున్నామ‌ని చెప్పాడు. గ‌త రెండు టెస్టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో సంతృప్తిగా ఉన్నాము.. ఇక్క‌డ కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాము. నాకు 100 టెస్టు కావ‌డం కూడా ఉత్సాహంగా ఉంద‌ని" తెలిపాడు. 

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

Latest Videos

రాజ్‌కోట్ స్టేడియం, పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది..? 

గుజరాత్ లోని రాజ్ కోట్ లో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం 2008లో ఏర్పాటు చేశాడు. 28,000 మంది ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ రిపోర్టును గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు అనుకూలంగా అవ‌కాశాలు ఉంటాయి. రాజ్‌కోట్  లోని  ఉపరితలం ఒక విలక్షణమైన భారత టెస్ట్ వికెట్ ను అందిస్తుంది. ఇక్కడ తొలి మూడు రోజులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఆ త‌ర్వాత బౌలింగ్ కు అనుకూలంగా పిచ్ మారుతుంది. దీంతో చివ‌రిరోజువ‌ర‌కు మ్యాచ్ ఎలా మ‌లుపు తిరుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంది.

భార‌త్ జ‌ట్టు: యశస్వి జైస్వాల్ , రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్ మ‌న్ గిల్, రజత్ పాటిదార్ , సర్ఫరాజ్ ఖాన్ , రవీంద్ర జడేజా , ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్), రవిచంద్రన్ అశ్విన్ , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్, 

బెంచ్: దేవ‌ద‌త్ పడిక్కల్, శ్రీకర్ భరత్ , అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్ , ఆకాష్ దీప్.

స‌హాయ సిబ్బంది: విక్రమ్ రాథోర్ , రాహుల్ ద్రవిడ్ , పరాస్ మాంబ్రే

ఇంగ్లాండ్ స్క్వాడ్: జాక్ క్రాలీ , బెన్ డకెట్ , ఒల్లీ పోప్ , జో రూట్ , జానీ బెయిర్‌స్టో , బెన్ స్టోక్స్ (కెప్టెన్) , బెన్ ఫోక్స్ (వికెట్ కీప‌ర్) , రెహాన్ అహ్మద్ , టామ్ హార్ట్లీ , మార్క్ వుడ్ , జేమ్స్ ఆండర్సన్. 

బెంచ్: షోయబ్ బషీర్ , ఆలీ రాబిన్సన్ , డేనియల్ లారెన్స్ , గుస్ అట్కిన్సన్

స‌హాయ‌క సిబ్బంది: బ్రెండన్ మెకల్లమ్ , పాల్ కాలింగ్‌వుడ్ , మార్కస్ ట్రెస్కోథిక్ , జీతన్ పటేల్ , నీల్ కిలీన్

యువరాజ్ సింగ్ నాయ‌క‌త్వంలో ఆడ‌నున్న బాబర్ ఆజం స‌హా ప‌లువురు పాకిస్తాన్ ప్లేయ‌ర్లు !

click me!