India vs England: ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ రికార్డుల మోత మోగిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ సెంచరీలు చేయగా, మరో ముగ్గురు ప్లేయర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ మరో అరుదైన ఘతన సాధించింది.
India vs England : భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరుగుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఇప్పటికే భారత్ తొలి టెస్టులో ఓటమి చూసినప్పటికీ ఆ తర్వాత అద్భుతమైన పునరాగమనంతో మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ లో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు 218 పరుగులకు ఆలౌట్ చేశారు.
తన కెరీర్ లో 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ప్రారంభించి అద్భుతమైన ఆటతో భారీ ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. టాపార్డర్ లోని వరుసగా ఐదుగురు ప్లేయర్లు పరుగుల వరద పారిస్తూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇద్దరూ నిలదొక్కుకుని సెంచరీలు కొట్టారు.
INDIA VS ENGLAND: కెప్టెన్‌గా రోహిత్ శర్మ మరో రికార్డు.. !
103 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. అతని తర్వాత గిల్ 110 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి మంచి భాగస్వామ్యం అందించడంతో భారత్ 300+ మార్కును దాటింది. ఆ తర్వాత 400 మార్కును చేరుకుంది. సర్ఫరాజ్ ఖాన్ 60 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో ఆడుతున్న దేవదత్ పడల్ 103 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇలా వరుసగా భారత్ టాపార్డర్ లోని వరుసగా ఐదుగురు ప్లేయర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత జట్టులోని టాప్ 5 బ్యాట్స్‌మెన్లు 15 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో హాఫ్ సెంచరీల రికార్డును అధిగమించారు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ ను 473/8 పరుగులతో కొనసాగిస్తోంది. ఇప్పటివరకు టీమిండియాకు 255 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం బుమ్రా (19* పరుగులు), కుల్దీప్ యాదవ్ (27* పరుగులు) క్రీజులో ఉన్నారు.
Devdutt Padikkal : తొలి టెస్టులోనే అదరగొట్టిన దేవదత్ పడిక్కల్..