Devdutt Padikkal : తొలి టెస్టులోనే అదరగొట్టిన దేవదత్ పడిక్కల్..

By Mahesh Rajamoni  |  First Published Mar 8, 2024, 4:32 PM IST

India vs England: ధ‌ర్మ‌శాలలో ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో భార‌త్ భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ తో భార‌త్ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 
 


Devdutt Padikkal: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ దేవదత్ పడిక్కల్ అరంగేట్రం మ్యాచ్ తోనే అర‌ద‌గొట్టాడు. అద్భుత‌మైన ఆట‌తో త‌న తొలి టెస్టు మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ, ఈ సిరీస్ లోని చివరి టెస్టులో 2వ రోజు ఈ త‌మిళ‌నాడు ప్లేయ‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 10 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో హాఫ్ సెంచ‌రీ చేసిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్.. 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పడిక్కల్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి భారత్ 275/2 వద్ద ప‌టిష్ట‌స్థితిలో ఉంది. పెద్ద‌గా అనుభ‌వం లేని మిడిల్ ఆర్డర్‌ను టార్గెట్ చేసిన స‌మ‌యంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తో క‌లిసి మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు.

సెంచ‌రీల త‌ర్వాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, శుభ్‌మన్ గిల్‌ల వికెట్ల‌ను భార‌త్ త్వరగా కోల్పోయింది. అయితే, ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన దేవ‌ద‌త్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ (56) నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని అందించ‌డంతో భార‌త్ స్కోర్ దిశ‌గా ముందుకు సాగింది. ఇద్ద‌రు హాఫ్ సెంచ‌రీలు చేసిన త‌ర్వాత యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు.

Latest Videos

ధ‌ర్మ‌శాల‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం ! తనదైన స్టైల్లో సెంచరీ సెలబ్రేషన్స్

దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ కెరీర్ ఇదే.. 

దేవ‌దత్ ప‌డిక్క‌ల్ తన 32 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 44+ సగటుతో 2,292 పరుగులు చేశాడు. 13 హాఫ్ సెంచ‌రీలు, ఆరు సెంచ‌రీలు కొట్టాడు. జనవరిలో 2024 రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై  చేసిన 193 ప‌రుగులు అత‌ని వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక స్కోర్. భార‌త్ త‌ర‌ఫున రెండు టీ20 మ్యాచ్ ల‌ను కూడా ఆడాడు. 2024 రంజీ ట్రోఫీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో చెల‌రేగాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 2024 రంజీ ట్రోఫీ సీజన్‌లో 92.66 సగటుతో ఆరు ఇన్నింగ్స్‌లలో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు కూడా ఉన్నాయి.

ఇక భార‌త్-ఇంగ్లాండ్ 5వ టెస్టు రెండో రోజు భార‌త్ భారీ అధిక్యం దిశ‌గా ముందుకు సాగుతోంది. 451/8 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తుండ‌గా, ఇప్ప‌టికే 233 ప‌రుగుల అధిక్యం ల‌భించింది. శుభ్‌మన్ గిల్ 110 ప‌రుగులు,  రోహిత్ శర్మ 103 ప‌రుగులతో సెంచ‌రీలు సాధించారు. య‌శ‌స్వి జైస్వాల్ 57 ప‌రుగులు, పడిక్కల్ 65 ప‌రుగులు, సర్ఫరాజ్ ఖాన్ 56 ప‌రుగులతో బ్యాటింగ్ లో రాణించారు. భారత్‌లోని టాప్-5 బ్యాటర్‌లలో ప్రతి ఒక్కరు టెస్ట్ ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాల్గవ సారి. 1998 కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై, 1999 మొహాలీలో న్యూజిలాండ్ పై, 2009 ముంబైలో శ్రీలంకతో జ‌రిగిన టెస్టులో ఈ మైలురాళ్లు అందుకుంది టీమిండియా.

శివరాత్రి రోజున శివాలెత్తిన రోహిత్ - గిల్.. ధర్మశాలలో సెంచరీల మోత !

 

click me!