INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రోహిత్ శర్మ రీఎంట్రీ, సూర్యకుమార్ యాదవ్‌కి...

Published : Mar 16, 2021, 06:40 PM IST
INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రోహిత్ శర్మ రీఎంట్రీ, సూర్యకుమార్ యాదవ్‌కి...

సారాంశం

రోహిత్ శర్మ రీఎంట్రీ... కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్న రోహిత్ శర్మ... వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్... సూర్యకుమార్ యాదవ్‌కి అంతలోనే నిరాశ...

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో‌ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టు తరుపున రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతో గత మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కించుకుని, బ్యాటింగ్ ఆడలేకపోయిన సూర్యకుమార్ యాదవ్‌ని రెండో మ్యాచ్‌కే పక్కనబెట్టింది టీమిండియా. 

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయబోతుండగా ఇషాన్ కిషన్ మూడో స్థానంలో రాబోతున్నట్టు విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో రెస్టు తీసుకున్న మార్క్ వుడ్ రీఎంట్రీ ఇవ్వగా, అతని స్థానంలో రెండో టీ20 ఆడిన టామ్ కుర్రాన్‌కి రెస్టు ఇచ్చింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి ఇది 100వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. 

ఇంగ్లాండ్ జట్టు:
జాసన్ రాయ్, బట్లర్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

భారత జట్టు:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !