2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో ఫిక్సింగ్ యత్నం... ఇద్దరు క్రికెటర్లపై ఎనిమిదేళ్ల నిషేధం...

By team teluguFirst Published Mar 16, 2021, 4:50 PM IST
Highlights

2019 వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల సమయంలో ఫిక్సింగ్‌కి యత్నించిన ఇద్దరు క్రికెటర్లు...

యూఏఈ క్రికెటర్లు మహ్మద్ నవీద్, సైమన్ అన్వర్ భట్‌ను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధించిన ఐసీసీ...

యూఏఈ దేశానికి చెందిన మహ్మద్ నవీద్, సైమన్ అన్వర్ భట్‌ను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. 2019లో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ సమయంలో ఈ ఇద్దరూ అవినీతికి పాల్పడినట్టు వెల్లడి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి.

మహ్మద్ నవీద్, సైమన్ అన్వర్ భట్‌లను 2019 వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల సమయంలో కొందరు బుకీలు కలిసారు. వారితో మ్యాచ్ ఫిక్సింగ్‌కి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐసీసీ విచారణలో అంగీకరించారు ఈ ఇద్దరు క్రికెటర్లు.  

అంతేకాకుండా 2019 టీ10 లీగ్ సమయంలో కూడా ఇద్దరు బుకీలను కలిసినట్టు అంగీకరించాడు నవీద్. 16, అక్టోబర్ 2019 నుంచి ఈ ఇద్దరిపై విధించిన నిషేధం అమలులోకి వస్తుంది. అంటే 2026 వరకూ దేశీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు వీరికి అనుమతి ఉండదు. 

click me!