మూడో టీ20కి ముందు టీమిండియాకి షాక్... 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ...

Published : Mar 16, 2021, 05:29 PM ISTUpdated : Mar 16, 2021, 05:34 PM IST
మూడో టీ20కి ముందు టీమిండియాకి షాక్... 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ...

సారాంశం

రెండో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజు కోత... వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లంక ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత... శ్రీలంక వన్డే టీమ్ పాయింట్లలో 2 పాయింట్లు కూడా తగ్గించిన ఐసీసీ... 

రెండో టీ20లో అద్భుత విజయం సాధించి, విజయోత్సహంతో మూడో వన్డేకి సిద్ధమవుతున్న టీమిండియాకు షాక్ తగిలింది. రెండో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, 20 ఓవర్లు పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం కంటే 10 నిమిషాలు ఎక్కువగా తీసుకుంది. దాంతో జట్టు మొత్తానికి జరిమానా విధించింది ఐసీసీ.

అదే విధంగా శ్రీలంక, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా లంక ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధించింది ఐసీసీ. అంతేకాకుండా శ్రీలంకకు 2 పాయింట్లు కూడా తగ్గించారు. 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !