India vs England: 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు.. ఇంగ్లాండ్ పై సెంచరీతో క‌దం తొక్కిన రోహిత్ శ‌ర్మ‌.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 15, 2024, 2:40 PM IST

India vs England : భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. హిట్ మ్యాన్ తన టెస్టు కెరీర్ లో 11వ సెంచ‌రీ కొట్టగా, ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 
 


Rohit Sharma's century: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. తొలి 10 ఓవ‌ర్ల‌లోనే 3 వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ నిల‌క‌డగా ఆడుతూ సెంచ‌రీతో క‌దంతొక్కాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటూ 11 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌లో సెంచ‌రీ కొట్టాడు. మ‌రో ఎండ్ లో భార‌త స్టార్ ఆల్ రౌండర్ ర‌వీంద్ర జ‌డేజా త‌న దైన ఆట‌తో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. ప్ర‌స్తుతం భార‌త్ 190/3 (53 ఓవర్లు) ప‌రుగుల‌తో ఆడుతోంది. కాగా, రోహిత్ శ‌ర్మ‌కు ఇది 11వ టెస్టు సెంచ‌రీ. త‌న టెస్టు కెరీర్ లో హిట్ మ్యాన్ ఇప్ప‌టివ‌ర‌కు 11 సెంచ‌రీలు, ఒక డ‌బుల్ సెంచ‌రీ, 17 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు.

 

Hit man Rohit Sharma scored 11th century in his Test career. Rohit century with 11 fours and 2 sixes against England at Rajkot. pic.twitter.com/Dcy2I2a1WE

— mahe (@mahe950)

Latest Videos

undefined

టెస్టుల్లో రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. 

భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో రోహిత్ శ‌ర్మ త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ లో రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త్ రెండో ప్లేయ‌ర్ గా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శ‌ర్మ త‌న టెస్టు కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 79 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ లిస్టులో టాప్ లో భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. సెహ్వాగ్ త‌న టెస్టు కెరీర్ లో 90 సిక్స‌ర్లు కొట్టాడు. ఆ త‌ర్వాతి  స్థానంలో ఎంఎస్ ధోని (78), స‌చిన్ టెండూల్క‌ర్ (69), క‌పిల్ దేవ్ (61) ఉన్నారు.

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

 

Most sixes for India in Test Cricket

90 - Virender Sehwag
79* - Rohit Sharma
78 - MS Dhoni
69 - Sachin Tendulkar
61* - Ravindra Jadeja
61 - Kapil Dev pic.twitter.com/TH9edUJFcA

— mahe (@mahe950)

 INDIA VS ENGLAND: సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ‌కు తెర‌.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తండ్రి.. ఎందుకంటే..?

click me!