Women’s T20 World Cup 2024 : 2020లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత మహిళల జట్టు తమ మొదటి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను ఆడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 99 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఇప్పుడు దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో ఛాంపియన్ గా నిలవాలని భారత్ బరిలోకి దిగుతోంది.
Women’s T20 World Cup 2024 : మరో ఐసీసీ సమరానికి ప్రపంచ క్రికెట్ దేశాలు సై అంటున్నాయి. ఇటీవలే పరుషుల ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ ముగిసింది. ఇప్పుడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ కు సర్వం సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 3న) నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దుబాయ్ (యూఏఈ) వేదికగా జగరనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 లో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ వాస్తవానికి బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది, కానీ, ప్రస్తుతం ఆ దేశంలోని రాజకీయ అశాంతి, ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ కి వేదికను మార్చారు.
undefined
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లను గమనిస్తే మిశ్రమ ఫలితాలు కనిపించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై సిరీస్‌ల పరాజయాలను ఎదుర్కొంది. అయితే బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను సమం చేసింది. ఆ తర్వాత 2024 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ లో ఓటమి ఎరుగని భారత జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024 కోసం దుబాయ్ లో అడుగుపెట్టింది భారత జట్టు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దుబాయ్ కి బయలుదేరే ముందు ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. అబుదాబి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సారి మెగా టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనపై నమ్మకంగా ఉన్నారు. మెగా టోర్నీలో పాలుపంచుకునే జట్లలో అన్ని జట్లను సవాల్ చేయగల సత్తా తమకు ఉందని తెలిపారు. ప్రస్తుతం తమకు అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్నారు. చాలా కాలంగా జట్టులో కీలక పాత్రప పోషిస్తూ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారు. అలాగే, యంగ్ ప్లేయర్లు కూడా ఉన్నారనీ, వారి పాత్రలు బాగా తెలుసునని అన్నారు. ప్రపంచ కప్‌లోకి వెళ్లే అత్యుత్తమ జట్టుగా ఉందని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 4 న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడనుంది. గత రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత మహిళల జట్టు ప్రదర్శన గమనిస్తే.. 2020 మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ తమ మొదటి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను ఆడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 99 పరుగులు మాత్రమే చేసింది. ఇక 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్ లో ఐదు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఇప్పుడు రాబోయే టోర్నీలో ఆస్ట్రేలియాను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి..
4 అక్టోబర్, శుక్రవారం, భారత్ v న్యూజిలాండ్, దుబాయ్, 7:30 PM IST
6 అక్టోబర్, ఆదివారం, భారత్ v పాకిస్థాన్, దుబాయ్, 3:30 PM IST
9 అక్టోబర్, బుధవారం, భారత్ v శ్రీలంక, దుబాయ్, 7:30 PM IST
13 అక్టోబర్, ఆదివారం, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, షార్జా, 7:30 PM IST
క్రికెట్ లవర్స్ మ్యాచ్ జరిగే వేదికలతో పాటు అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు టీవీ, ఆన్ లైన్ లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీ20 ప్రపంచ కప్ ప్రసారాలు అందిస్తోంది. అలాగే, మొత్తం 23 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారాలను డిస్నీ+ హాట్‌స్టార్ అప్లికేషన్, వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చు.