బంగ్లా క్రికెటర్ రికార్డు: సచిన్, ద్రవిడ్ ల తరువాత ముష్ఫికరే!

By telugu teamFirst Published Nov 16, 2019, 3:35 PM IST
Highlights

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో భాగంగా ముష్పికర్‌ రహీమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. 

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో భాగంగా ముష్పికర్‌ రహీమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. 

పరుగులు చేయలేక బంగ్లా టీం పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముష్పికర్‌ వికెట్ ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను సాధ్యమైనంతవరకూ కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే అతనికి సహచరుల నుంచి తోడ్పాటు లభించడం లేదు. అవతలివైపు టప టపా వికెట్లు పడుతున్నా, తాను మాత్రం ఏ మాత్రం నిగ్రహం కోల్పోకుండా ఆడుతూ ఇందాకే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 

Also read: గంభీర్ ని కడుపుబ్బా నవ్వించిన లక్ష్మణ్

ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మహ్మద్‌ అష్రాఫుల్‌ పేరిట ఉండేది. ఆ రికార్డును ముష్పికర్‌ బ్రేక్‌ చేశాడు. అష్రాఫుల్‌ టెస్టుల్లో భారత్‌పై 386 పరుగులు చేయగా, దాన్ని ముష్ఫికర్‌ దాటేశాడు.  

ఇప్పటివరకు భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన అన్ని టెస్టుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాను పరిశీలిస్తే ముష్ఫికర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో తొలి స్థానంలో 820 పరుగులతో సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు.  ఆ తరువాతి స్థానంలో 560 పరుగులు సాధించిన రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాన్ని ముష్పికర్‌ కైవసం చేసుకున్నాడు. 

Also read: విరాట్ కోరిక తీర్చని మయాంక్.. డబల్ కాదు, త్రిబుల్ వీడియో వైరల్

టెస్టుల్లో భారత్‌పై 55 కు పైగా సగటుతో అతను పరుగులు సాధించాడు. భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ముష్పికర్‌, తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో బాటింగ్ చేసాడు. ఈ క్రమంలో రెండు శతకాలు బాదాడు.  ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ముష్పికర్‌ బాటింగ్ కు వచ్చాడు. 

బాంగ్లాదేశ్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో విధించిన 493 పరుగుల టార్గెట్ ను చేరుకోలేక తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలింది. ఆ తరువాత ఫాలో ఆన్ లో కూడా ఆ టీం కు కష్టాలు తప్పడం లేదు. 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఊగిసలాడుతుంది.  

click me!