
ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు సొంతం చేసుకోనున్నారో తేలిపోనుంది. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు ప్రస్తుతం ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తొలి సెమీ ఫైనల్ ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. తొలి నుంచి విజయోత్సహంతో ఉన్న టీమిండియా మంగళవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి టైటిల్ గెలుచుకోవాలని కసితో ఉంది. కాగా ఆస్ట్రేలియా సైతం అదే పట్టుదలతో రంగంలోకి దిగుతోంది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైన్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిని ఎవరు మర్చిపోలేరు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపథ్యంలో టీమిండియా ఆ ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించాలని ఆశిస్తున్నారు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మార్చి 4వ తేదీన మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి లైవ్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇక ఓటీటీ విషయానికొస్తే జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూసే అవకాశం ఉంది. జియో హాట్‌స్టార్ విలీనం తర్వాత జియోహాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే పాత ప్లాన్ యాక్టివ్‌లో ఉన్నవారు ప్రత్యేకంగా కొత్త సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
మంగళవారం దుబాయ్‌లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. వాతావరణం మ్యాచ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే సమయం గడిచేకొద్దీ స్పిన్నర్‌లకు అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ అభప్రాయపడుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డుల విషయానికొస్తే.. టీమిండియాదే ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు పోటీ పడగా, రెండు సార్లు టీమిండియా, ఒక మ్యాచ్‌లో ఆసీస్ గెలవగా, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11(అంచనా): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్. న్యూజిలాండ్‌తో ఆడిన జట్టుతోనే టీమిండియా ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.