IND Vs NZ: వ‌రుస వికెట్ల‌తో న్యూజిలాండ్ భ‌ర‌తంప‌ట్టిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. వీడియో

Published : Mar 02, 2025, 11:40 PM ISTUpdated : Mar 02, 2025, 11:41 PM IST
IND Vs NZ: వ‌రుస వికెట్ల‌తో న్యూజిలాండ్ భ‌ర‌తంప‌ట్టిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. వీడియో

సారాంశం

India vs New Zealand Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చక్రవర్తి మంత్రముగ్ధులను చేసే బౌలింగ్ తో  న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజ‌యాల‌తో గ్రూప్ A లో టాప్ లో నిలిచింది.  

IND vs NZ Champions Trophy 2025: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి టీ20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోవ‌డం చాలా కాలంపాటు మ‌ర్చిపోలేని మ‌చ్చ‌గా ఉంది. అయితే, ఇప్పుడు దానిని మ‌రిపిస్తూ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత‌మైన బౌలింగ్ లో మ్యాజిక్ చేశాడు. భార‌త్ కు సూప‌ర్ విక్ట‌రీ అందించాడు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 చివ‌రి గ్రూప్ మ్యాచ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్ కు పంపాడు. త‌న 10 ఓవ‌ర్ల‌లో బౌలింగ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 42 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. దీంతో ఈ ఐసీసీ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ ఏలో 6 పాయంట్ల‌తో టాప్ లో నిలిచింది. ఇప్పుడు మంగళవారం ఇదే వేదిక‌గా జరిగే మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భార‌త్ తలపడనుంది.

హర్షిత్ రాణా స్థానంలో ప్లేయింగ్ XIలోకి వచ్చిన తమిళనాడు స్పిన్నర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల‌ను త‌న బౌలింగ్ తో చెడుగుడు ఆడుకున్నాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మిస్ట‌రీ స్పిన్ ను ఎలా ఆడాలో తెలియ‌క కీవీస్ ప్లేయ‌ర్లు వ‌రుస‌గా వికెట్లు వ‌దులుకున్నారు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 81 ప‌రుగుల ఇన్నింగ్స్ మిన‌హా న్యూజిలాండ్ ప్లేయ‌ర్ల‌లో ఎవ‌రు పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. ఈ మ్యాచ్ లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న తొలి వికెట్ గా విల్ యంగ్ ను ఔట్ బౌల్డ్ చేశాడు. 

ఆ తర్వాత వరుణ్ తన రెండో స్పెల్‌లో వ‌రుస వికెట్లు తీసుకుని అద‌ర‌గొట్టాడు. వరుస ఓవర్లలో ప్రమాదకరమైన గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్‌లను అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత‌ 45వ ఓవర్‌లో కేవలం మూడు బంతుల వ్యవధిలో మిచెల్ సాంట్నర్, మ్యాట్‌ హెన్రీలను ఔట్ చేసి వ‌న్డేల్లో తొలిసారి 5 వికెట్లు తీసుకున్నాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

 

 

 

ఇది కూడా చదవండి: 

Champions Trophy : వ‌రుస‌గా 10వ సారి ఓడిన రోహిత్ శ‌ర్మ‌.. భార‌త్ గెలుస్తుంది.. ఇదెక్క‌డిలెక్క సామి !

IND Vs NZ: వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చక్రం తిప్పితే అట్లుంటది మరి !

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు