జడ్డూ మ్యాజిక్! ... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా! స్టీవ్ స్మిత్ అవుట్...

Published : Feb 09, 2023, 01:04 PM IST
జడ్డూ మ్యాజిక్! ... ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా! స్టీవ్ స్మిత్ అవుట్...

సారాంశం

నాగ్‌పూర్ టెస్టు:  వెంటవెంటనే 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా... 109 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా... 

India vs Australia 1st test: దాదాపు ఆరు నెలల బ్రేక్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, తొలి ఇన్నింగ్స్‌లో బంతితో దుమ్మురేపుతున్నాడు. వెంటవెంటనే మూడు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా కారణంగా 109 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా... 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. 2.1 ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది టీమిండియా. రెండో ఓవర్ మొదటి బంతికి మహ్మద్ సిరాజ్, ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేయగా, మూడో ఓవర్ తొలి బంతికి డేవిడ్ వార్నర్‌కి క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...


మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్, తొలి బంతికి ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూకి టీమిండియా అప్పీలు చేసినా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఏడో బంతికే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్న టీమిండియా, కావాల్సిన ఫలితం రాబట్టింది.

టీవీ రిప్లైలో బంతికి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో ఉస్మాన్ ఖవాజా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.. అయితే మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.. 123 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ చేసిన శ్రీకర్ భరత్, టీమిండియాకి కావాల్సిన బ్రేక్ అందించాడు...

ఆ తర్వాతి బంతికి మ్యాట్ రెంషోని గోల్డెన్ డకౌట్ చేశాడు రవీంద్ర జడేజా. దీంతో 84 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 107 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసిన డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు రవీంద్ర జడేజా...

42 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. రవీంద్ర జడేజా తాను వేసిన 14 ఓవర్లలో 7 మెయిడిన్లతో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !