తడబడి నిలబడిన ఆస్ట్రేలియా... లంచ్ బ్రేక్ సమాయానికి! ఆ ఇద్దరినీ అవుట్ చేయకపోతే...

By Chinthakindhi RamuFirst Published Feb 9, 2023, 11:48 AM IST
Highlights

మూడో వికెట్‌కి అజేయంగా 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన స్టీవ్ స్మిత్, లబుషేన్... లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. 

నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆరంభంలో తడబడినా ఆ తర్వాత త్వరగానే కోలుకుంది. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.. 

మార్నస్ లబుషేన్ 110 బంతుల్లో 8 ఫోర్లతో 47 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 74 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేశాడు. 2.1 ఓవర్లలోనే 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని  ఈ ఇద్దరూ కలిసి ఆదుకున్నారు. మూడో వికెట్‌కి 179 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు స్మిత్, లబుషేన్...

ఈ ఇద్దరినీ వీలైనంత త్వరగా అవుట్ చేయకపోతే ఆసీస్‌కి భారీ స్కోరు దక్కడం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో 200+ స్కోరు దక్కితే వాళ్లను నిలువరించడం కష్టమని టాస్ సమయంలో రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు.

ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ అదరగొడుతున్న సమయంలో వారిని తప్పించి, స్పిన్నర్లను తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. అయితే స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన ఆసీస్ టాప్ బ్యాటర్లు... భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు.  తొలి సెషన్‌లో రవీంద్ర జడేజా 9, అక్షర్ పటేల్ 8, రవిచంద్రన్ అశ్విన్ 5 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ సాధించలేకపోయారు.. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. 2.1 ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది టీమిండియా. రెండో ఓవర్ మొదటి బంతికి మహ్మద్ సిరాజ్, ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేయగా, మూడో ఓవర్ తొలి బంతికి డేవిడ్ వార్నర్‌కి క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ...


మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్, తొలి బంతికి ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూకి టీమిండియా అప్పీలు చేసినా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇన్నింగ్స్ ఏడో బంతికే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్న టీమిండియా, కావాల్సిన ఫలితం రాబట్టింది.

టీవీ రిప్లైలో బంతికి వికెట్లను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించడంతో ఉస్మాన్ ఖవాజా 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. దీంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.. 

click me!