India vs Australia: మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఐదో రోజుకు చేరుకుంది. WTC ఫైనల్ 2025లో చోటు దక్కించుకోవాలంటే భారత జట్టు ఈ మ్యాచ్‌ను గెలవాలి. ఇప్పటివరకు ఈ మ్యాచ్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
IND vs AUS 2024: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా - ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇరు జట్లు చెర్ మ్యాచ్ ను గెలవగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో కీలకమైన నాల్గో మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికాగా జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. కంగారూలు 333 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉంది. 173 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ పడింది. కానీ, చివరి వికెట్ కోసం భారత బౌలర్లు ఎదురు చూశారు, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ మధ్య 55 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. ఐదో రోజు ఉదయం ఒక వికెట్ తీసి భారత్ బ్యాటింగ్‌కు దిగుతుంది. చివరి రోజు ఆటలో టీమ్ ఇండియాకు పరుగులు చేధించడం అంత సులభం కాదు.
బాక్సింగ్ డే టెస్ట్ భారత్ నుంచి చేజారిపోతున్నట్లు కనిపించింది. కానీ, నీతీష్ కుమార్ రెడ్డి శతకం, ఆ తర్వాత బుమ్రా అద్భుత బౌలింగ్‌తో భారత్ ఈ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది. 300+ టార్గెట్ ను అందుకుని భారత్ మెల్‌బోర్న్ టెస్ట్‌ను గెలవాలంటే ముగ్గురు బ్యాట్స్‌మెన్ వేగంగా, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు ఇంకా ఒక వికెట్ మిగిలి వుంది కాబట్టి సోమవారం తొలి సెషన్ లో ఇండియా ముందు ఎన్ని పరుగుల లక్ష్యాన్ని ఉంచుతుందో స్పష్టమవుతుంది. క్రికెట్‌లో ఏదైనా సాధ్యమే. ఈ మ్యాచ్‌ను చివరి రోజు కూడా భారత్ గెలిపించగల ముగ్గురు బ్యాట్స్‌మెన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వేగంగా పరుగులు రాబట్టడంలో మంచి గుర్తింపు పొందాడు. క్రికెట్ మైదానంలో అన్ని వైపులా షాట్లు కొట్టడంలో ఈ యంగ్ ప్లేయర్ దిట్ట. టీమిండియా విజయానికి ఈ ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్ నుంచి వేగవంతమైన ఆరంభం అవసరం. టెస్ట్ క్రికెట్‌లో యశస్వి 17 మ్యాచ్‌ల 32 ఇన్నింగ్స్‌లలో 53.33 సగటుతో 1600 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 214 నాటౌట్. జైస్వాల్ కు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉంది. భారత్‌కు యశస్వి నుంచి మంచి ఆరంభం లభిస్తే, మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
YASHASVI JAISWAL IS THE FIRST ASIAN BATTER IN HISTORY TO CONVERT ALL OF HIS FIRST 4 TEST HUNDREDS INTO 150....!!!! 🤯🇮🇳 pic.twitter.com/Ya1n8RSX3Y
— Mufaddal Vohra (@mufaddal_vohra)
నితీష్ కుమార్ రెడ్డి సత్తాను మెల్‌బోర్న్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లో అందరూ చూశారు. అద్భుతమైన టెక్నిక్ కలిగిన నితీష్ రెడ్డి తన ఇన్నింగ్స్‌లో అద్భుతమైన షాట్లు ఆడాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నీతీష్‌ను టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు పంపవచ్చు. నీతీష్ వేగంగా ఆడటంలో కూడా గుర్తింపు పొందాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024లో ఈ ఆటగాడు అత్యధిక సిక్సర్లు కొట్టాడు. ఐదో రోజు ఆటలో భారత్ ఈ ఆటగాడిని మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపిస్తే, అతను ఒంటరిగా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు.
Congratulations to Nitish kumar reddy on scoring his first century. This remarkable achievement reflects hard work and dedication. We look forward to witnessing more successes in your career. Keep inspiring us all. pic.twitter.com/fjhe7iN8T9
— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11)
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ సత్తాను ఇప్పటికే అందరూ చూశారు. ఒక్క రోజులోనే మ్యాచ్ గెలిపించే సత్తా అతని సొంతం. 2021లో బ్రిస్బేన్ మైదానంలో 97 పరుగులు చేసి ఐదో రోజు మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్ భారత్ చేజారిపోతున్నట్లు కనిపించింది. టీమ్ ఇండియా మరోసారి మెల్‌బోర్న్‌లో ఇదే ఫీట్‌ను పునరావృతం చేయాలంటే రిషబ్ పంత్ బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాలి. పంత్‌కు ఒంటరిగా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉంది. ఆస్ట్రేలియాపై ఇప్పటికే అలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి భారత్ కు విజయాలు అందించాడు.
On this day in 2021, Rishabh Pant smashed 97 runs from just 118 balls while chasing 407 on Day 5.
A trailer before the Gabba Test. pic.twitter.com/cP4LrofTfg
— Johns. (@CricCrazyJohns)
ఇవి కూడా చదవండి:
3 క్యాచ్‌లు మిస్ - యశస్వి జైస్వాల్ పై రోహిత్ శర్మ ఆగ్రహం.. హిట్ మాన్ కు మాజీల షాక్
భారత్ vs ఆస్ట్రేలియా: 147 ఏళ్ల క్రికెట్ లో తొలి ప్లేయర్.. జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు