IND vs AUS T20 Series: ఈ సిరీస్ లోని తొలి గేమ్‌తో పోలిస్తే 2వ మ్యాచ్‌లో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. రెండో గేమ్‌లో ఆస్ట్రేలియా బౌండరీ శాతాన్ని తగ్గించారు. అయితే, గత రెండు మ్యాచ్ లతో పోలిస్తే.. కంగారులు మూడో టీ20లో పుంజుకునే అవకాశముందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
IND vs AUS, 3rd T20I: భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ పై భారత్ కన్నేసింది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లను గెలుచుకున్న భారత్.. నేడు జరగబోయే మూడో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన మంచి జోష్ లో కనిపించిన ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోవడంతో కాస్త ఒత్తిడిలోకి జారుకున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ మూడో మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు కంగారుల వర్గాలు తెలిపాయి.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మంగళవారం గౌహతిలో జరగనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండింటిలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సిరీస్ ను నిలుపుకోవాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. భారత జట్టు విషయానికొస్తే, శ్రేయస్ అయ్యర్ తదుపరి మ్యాచ్ లో చేరడంతో, ప్రస్తుత సిరీస్ లో తిలక్ వర్మకు ఈ మ్యాచ్ చివరి అవకాశం కావచ్చు. బ్యాట్ తో ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్ లో చేరడం పక్కాగా కనిపిస్తోంది. అయితే భారత్ ఆడిన చివరి 12 టీ20ల్లోనూ తిలక్ కు చోటు దక్కింది.
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ చెరో హాఫ్ సెంచరీతో టాప్ ఆర్డర్ లో రాణించారు. ఇషాన్ కిషన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రింకూ సింగ్ వేగంగా పరుగులు సాధించి ఫినిషింగ్ ప్లేస్ ను ఖాయం చేసుకున్నాడు. తొలి మ్యాచ్ తో పోలిస్తే రెండో మ్యాచ్ లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. రెండో గేమ్ లో ఆస్ట్రేలియా బౌండరీ శాతాన్ని తగ్గించారు. ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ అందరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లను దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మరోవైపు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లలు రాణించకపోవడంతో ఆస్ట్రేలియా కంగారు పడుతోంది. అయితే సిరీస్ ను నిలుపుకోవాలనే ఒత్తిడితో ఉన్న ఆస్ట్రేలియన్లు ఈ మ్యాచ్ లో పుంజుకునే అవకాశం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు గౌహతిలోని బసపర క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్పోర్ట్స్ 18, జియో సినిమాలలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. పిచ్ గమనిస్తే.. గౌహతిలోని బస్సపర గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇక్కడ 6 టీ20 మ్యాచ్‌లు జరగ్గా అందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 3 గెలిచాయి.