Babar Azam బ్యాటింగ్ పై ట్వీట్: బాబర్ ఆజంపై ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ వైరల్

By narsimha lode  |  First Published Nov 27, 2023, 9:47 PM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యుడు బాబర్ అజం పై ఐస్ లాండ్  క్రికెట్  చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  ఓ ట్వీట్ కు సమాధానంగా  ఐస్‌లాండ్ క్రికెట్ ఇచ్చిన సమాధానం  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


న్యూఢిల్లీ:పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం సగటుపై ట్రోల్ చేసింది ఐస్‌లాండ్ క్రికెట్. ప్రపంచకప్ పురుషుల వన్ డే కప్ లో  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్  పేలవమైన ప్రదర్శన చేశారు.ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లోని తొమ్మిది మ్యాచుల్లో బాబర్ ఆజం   320 పరుగులు చేశాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ కు కూడ అర్హత సాధించలేదు.  ఈ పోటీల నుండి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ పోటీ ముగిసిన తర్వాత  అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ లోని అన్ని ఫార్మెట్ల  నుండి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పారు బాబర్ ఆజం. 

The batting average of Babar Azam https://t.co/huYKEAD8uP

— Iceland Cricket (@icelandcricket)

వరల్డ్ స్టాటిటిక్స్ ట్వీట్ కు  ఐస్‌లాండ్  క్రికెట్  స్పందించింది. బాబర్ ఆజం  పై  విరుచుకుపడింది.   మహమ్మారి తర్వాత ఇప్పటికి సాధారణ స్థితికి చేరుకోని విషయం ఏమిటని  వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు  ఐస్‌లాండ్  క్రికెట్ ఇచ్చిన సమాధానం  వైరల్ గా మారింది.  పాకిస్తాన్ జట్టు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్  బాబర్ ఆజం  బ్యాటింగ్ యావరేజీ అంటూ  ఐస్‌లాండ్ క్రికెట్  సమాధానమిచ్చింది. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Videos

undefined

బాబర్ ఆజం కెప్టెన్నీ నుండి తప్పుకోవడంతో   పాకిస్తాన్ పురుషుల క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ గా షాన్ మసూద్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది.  బాబర్ ఆజం   కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలగడంతో షహీన్ షా ఆఫ్రిది టీ20వన్ డే కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

34 ఏళ్ల షాన్ 30 టెస్టుల్లో  1,597 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి.ఐసీసీ  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 ముగిసేవరకు  షాన్ కెప్టెన్ గా కొనసాగుతాడు.  డిసెంబర్  14 నుండి అస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు షాన్ పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు.

ఇదిలా ఉంటే ఎడమ చేతి  పేసర్ షాహీన్ షా టీ20 వన్ డే ఫార్మాట్ లో  పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు  నాయకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది జనవరి  12 నుండి న్యూజిలాండ్ లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ ల టీ20 వన్ డే సిరీస్ కు  షాహీన్ షా  నాయకత్వం వహిస్తాడు. 23 ఏళ్ల షాహీన్  52 టీ20 వన్ డేల్లో  64 వికెట్లు పడగొట్టాడు.  షాహీన్ హెచ్‌బీఎల్ పీఎస్‌ఎల్ లాహోర్ క్వాలండర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. 20222, 2023  రెండుసార్లు టోర్నమెంట్లను గెలుచుకోవడంలో  జట్టుకు షాహిన్ దోహదపడ్డాడు.
 

click me!